నేను, కేసీఆర్‌లే ఎన్టీఆర్‌కు నిజమైన శిష్యులం
రేవంత్ జాగ్రత్త: మంత్రి తుమ్మల
ఖమ్మం: ‘టీడీపీ ఆది నుంచి అంతం వరకు మేము ఉన్నాం.. నేను, కేసీఆర్‌లే ఎన్టీఆర్‌కు నిజ మైన వారసులం.. ఆయన ఆశ యాలు, సంక్షేమాన్ని మేము కొనసాగిస్తున్నాం.. ఆ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.. కేసీఆర్ ఆహ్వానం మేరకు పార్టీలోకి వచ్చా..’’అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మంత్రి ఖమ్మంలో విలేకరులతో మాట్లాడారు. పోరంబోకు లతో రాళ్లు వేయించి అమాయక రైతులపై కేసు లయ్యేలా ఉసిగొల్పారని, ‘మొగుడ్ని కొట్టి మొగసాలె త్తినట్లుగా’ ప్రతిపక్షాల తీరు ఉందన్నారు. పదిరోజు లుగా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న నాయకుల్లో ఒక్కరు కూడా రైతులేడని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పత్తికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని చెప్పడంతో ఈ ఏడాది రైతులు మిర్చితోపాటు ఇతర పంటలను సాగు చేశారని తెలి పారు. డిమాండ్ తగ్గిపోవడంతోనే మార్కెట్‌లో మిర్చి ధర తగ్గుముఖం పట్టిందని, అయినా క్వింటాల్‌కు సరాసరిగా రూ.7 వేల వరకు ఖమ్మం మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు జరిగాయన్నారు. రేవంత్‌రెడ్డి కేవలం సీఎం, ఆయన కుటుంబ సభ్యులనే టార్గెట్‌గా చేసుకుని విమర్శిస్తున్నారే తప్ప సరైన ప్రణాళిక లేదన్నారు. తాను గెలిచిన నియోజకవర్గం, జిల్లా ప్రజల గురించి సోయిలేని రేవంత్‌రెడ్డి ఇక్కడకు వచ్చి ఆసు కవితలు వినిపిస్తున్నారని ఆరోపించారు. రాను న్న రోజుల్లో కొడంగల్ ప్రజలే ఆయనను బట్టలిప్పి కొడతారనే విషయం తెలుసుకోవాలన్నారు. విలేక రుల సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.