వీణవంక(కరీంనగర్) : మైనర్పై ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న వ్యక్తిపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువకుడే కాకుండా అదే గ్రామానికి చెందిన మరో నలుగురు యువకులు.. ఆ విషయం తమకు తెలుసని, తమతో సహకరించకపోతే అందరికి చెప్తామని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కరీనంగర్ జిల్లా కోనరావుపేట మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో.. అమ్మమ్మ వద్ద ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో గత మే నెలలో చెరువు కట్ట వద్ద ఒంటరిగా ఉన్న బాలికపై అదే గ్రామానికి చెందిన నిమ్మల కుమారస్వామి, నిమ్మల కళ్యాణ్, దూలం శ్రీకాంత్, పూదరి మొండయ్య అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. దీంతో బాలిక జరిగిన ఘోరాన్ని ఎవరికి చెప్పుకోలేక పోయింది. మరో 25 రోజుల క్రితం గ్రామ శివారులో వంట చెరుకు కోసం బాలిక వెళ్లగా నిమ్మల వినోద్ లైంగిక దాడికి పాల్పడి, బెదిరించడంతో అప్పుడు ఎవరికి చెప్పుకోలేకపోయింది. చివరికి విషయం కుల పెద్దల దృష్టికి వెళ్లటంతో వారు పోలీసులను ఆశ్ర యించారు. పోలీసులు గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. ఆ మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు వారిపై నిర్భయ కేసు నమోదు చేశారు. లైంగికదాడిలో మరో ముగ్గురిప్రమేయం కూడా ఉన్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
మైనర్ పై అత్యాచారం-నిందితులపై నిర్భయ కేసు
Published Mon, Sep 21 2015 6:40 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement
Advertisement