Konaraopet
-
మళ్లీ మోసపోతే మనదే తప్పు
సిరిసిల్ల: ఒక్కసారి మోసపోతే.. మోసం చేసిన వాడి ది తప్పు, రెండోసారి మళ్లీ వారి చేతిలోనే మోసపోతే.. తప్పు మనదే అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీలో మోదీ.. ఇక్కడ కేడీ.. ఇద్దరూ మోసగాళ్లు, వాళ్ల మాయలో పడొద్దు.. ఆలోచించండి’ అని పిలుపునిచ్చారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మోసం పార్ట్–1 చూపిస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పార్ట్–2 చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలకేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. రైతుబంధు లేదు, రుణమాఫీ కాలేదు, మహిళలకు రూ.2,500 ఇయ్యలే.. పెన్షన్లు రూ.4వేలకు పెంచలే.. ఇంట్లో ఇద్దరికీ పెన్షన్లు ఇయ్యలే.. కరెంట్ లేదు, నీళ్లకు గోస, కరెంట్ మోటార్లు కాలుడు.. ఇదంతా కాంగ్రెస్ పాలన తీరు.. అని విమర్శించారు. భార్యాపిల్లలపై ఎందుకు ఒట్టేయడం లేదు పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఆగస్టులో రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి దేవుడిపై ఒట్టు పెడుతున్నాడని, అదే ఆయన భార్య, పిల్లల మీద ఎందుకు ఒట్టు పెట్టడం లేదని కేటీఆర్ నిలదీశారు. దేవుడు ఏమీ అనడని మళ్లీ మోసం చేయొచ్చని సీఎం చూ స్తున్నాడని ఆరోపించారు. రైతుబంధు ఇయ్యనోడు, రూ.40 వేల కోట్లు మాఫీ చేస్తాడా ? అని ప్రశ్నించారు. రైతుబంధుకు రాంరాం.. అంటున్నారని, ఆ డబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని మో సం చేశారని ఎద్దేవా చేశారు. జనవరి నెల ఆసరా పెన్షన్లను రేవంత్‌రెడ్డి ఎగ్గొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలు అమలుకావాలంటే.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే.. వాళ్లకు భయం ఉండాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని కేటీఆర్ అన్నారు. 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తే.. కేసీఆర్ మళ్లీ రాజకీయాలను శాసిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ బండి సంజయ్ ఒక్క గుడికి నిధులు తేలేదు.. బడికి నిధులు ఇవ్వ లేదు.. దేవున్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. బండి సంజయ్.. అమిత్‌షా చెప్పులు మోసుడు తప్ప ఐదేళ్లలో ఏం చేయనోడికి మళ్లీ ఓట్లు ఎందుకు వేయాలని కేటీఆర్ నిలదీశారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు సిరిసిల్లలో ఒకే రోజు ఇద్దరు నేతకారి్మకులు ఆత్మహ త్య చేసుకోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమని ఆగ్రహించిన కేటీఆర్.. సిరిసిల్లను ఉరిసిల్లగా మా ర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఆత్మహత్యకు పాల్పడిన నేతకారి్మక కుటుంబాలను గురువారం రాత్రి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున సాయం అందించారు. -
సిరిసిల్లలో చిరుత కలకలం.. పొలాల్లో రెండు పిల్లలు లభ్యం
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం రాత్రి చిరుతపులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ పిల్లను చిరుత తీసుకువెళుతుండగా పొలం పనులకు వెళుతున్న రైతు చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో చిరుత రైతుల అలజడి విని ఓ పిల్లను వదిలేసి వెళ్ళింది. చిరుత పిల్లను చూసేందుకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. చిన్న చిరుతతో ప్రజలు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పాల కోసం ఏడుస్తున్న చిరుత పిల్లలకు పాలు తాగించే యత్నం చేశారు. అనంతరం అటవీశాఖ అధికారులు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పిల్లను కరీంనగర్‌కు తరలించారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులను హెచ్చరించారు. అయితే చిరుత పిల్ల లభ్యం కావడంతో శివంగులపల్లితో పాటు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
రెండు దశాబ్దాల్లోనే మారిన దశ.. నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం
సిరిసిల్ల: గోధూళి వేళ.. వ్యవసాయ పనులు ముగించుకుని అందరూ ఇళ్లకు చేరుతున్నారు.. సూర్యుడు అస్తమించాడు.. చీకటి కమ్ముకుంటుంది.. అంతలోనే కంజీరమోతలు.. ఎర్రెర్రని పాటలు.. ఆవేశపూరిత ప్రసంగాలు.. దోపిడీలేని సమాజం కోసం విప్లవించాలనే నినాదాలు.. ప్రజాకోర్టు.. ఊరిలోని అంశాలపై బహిరంగ చర్చలు.. లాల్ సలామ్ అంటూ.. వీడ్కోలు..! మరసటి రోజు తెల్లవారుజామున 5 గంటలు.. బూట్ల చప్పుళ్లతో ఊరు తెల్లవారింది.. ఆ పల్లెలోని వారిని ఊరు విడిచి వెళ్లకుండా కట్టడి. గ్రామ చావడి వద్దకు అందరిని చేర్చి ప్రజాదర్భార్. మేమున్నదే మీకోసం అంటూ అడవుల్లో తిరిగే వాళ్లకు మీరు అన్నం పెట్టొద్దు.. మొన్న వాళ్లకు అన్నం పెట్టిన వారు ఎవరో మాకు తెలుసు.. వాళ్ల సంగతి మేం చూసుకుంటాం.. మీరు మాత్రం వాళ్లకు సహకరించొద్దు. చట్టం ఉందే మీకోసం.. అంటూ.. ఖాకీ డ్రెస్సుల పిలుపు..! ఇది రెండు దశాబ్దాల కిందట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పల్లెల్లో పరిస్థితి. అడకత్తెరలో పోకచెక్కల్లా ప్ర జలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. ఊరు మారింది ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితులు, ఇప్పటి స్థితిని అంచనా వేస్తే పల్లెలు ఎంతో మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల కోనరావుపేట మండలం బావుసాయిపేటను పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆ పల్లెకు వాహనయోగం వ చ్చింది. అప్పట్లో ఊరు మొత్తంలో మూడు, నాలు గు వాహనాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇంటికో బైక్, ఊరి నిండా ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు ఇలా ఎంతో మార్పు వచ్చింది. జిల్లాలోనే అత్యధి క కోళ్ల పరిశ్రమ ఆ గ్రామంలో విస్తరించింది. 20 కోళ్ల ఫారాలతో పౌల్ట్రీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఆ ఊరిలో పట్టణాల తరహాలో సూపర్మార్కెట్లు నడుస్తున్నాయి. ఒకప్పటి కల్లోల పల్లె ఇప్పుడు ప్రశాంతంగా ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. బావుసాయిపేట ఊరి జనాభా నాలుగు వేలు. ఓటర్ల సంఖ్య 2,740, వార్డులు పది. నివాసాల సంఖ్య 876. చిన్న ఊరే అయినా అభివృద్ధిలో అగ్రపథాన నిలుస్తుంది. తీరొక్కటి దొరికే... సంత బావుసాయిపేటలో ప్రతీ బుధవారం జరిగే వారసంతలో తీరొక్క వస్తువులు దొరకుతాయి. చేపలు, రొయ్యలు మొదలు కొని బట్టలు, నిత్యసవరమైన వస్తువులు అన్నీ లభి స్తాయి. దీంతో కొండాపూర్, వెంకట్రావుపేట, బండపల్లి, గోవిందరా వుపల్లె గ్రామాల వాసులు వారసంతకు వచ్చి సరుకులు కొనుగోలు చేస్తారు. ఊరు శివారులో మూలవాగు, మరో రెండు చెరువులు ఉండడంతో భూగర్భజలాలకు కొదువ లేదు. వరి, పత్తి, మొక్కజొన్న, నువ్వులు వంటి పంటలను సాగుచేస్తారు. భూములు కొనుగోలు, విక్రయాలతో ఊరి ఆర్థికస్థితి మెరుగుపడింది. వ్యవసాయంలో బావుసాయిపేటలో అగ్రగామిగా నిలుస్తుంది. దీంతో గ్రామీణ ఆర్థికస్థితి ఎంతో బాగుపడింది. ఊరిలో రోడ్డుకు ఇరువైపులా ఉండే చెట్లు పల్లె అందాన్ని పెంచాయి. ఎంతో మార్పు వచ్చింది ఒకప్పటితో పోల్చితే ఊరిలో ఎంతో మార్పు వచ్చింది. రోడ్లు బాగుపడ్డాయి. రవాణా వసతి పెరిగింది. కమ్యూనికేషన్ పెరిగింది. ప్రజల జీవనంలోనూ మార్పు వచ్చింది. పట్టణాల్లో దొరికేవి అన్ని పల్లెల్లో అన్నీ లభిస్తున్నాయి. – బైరగోని నందుగౌడ్, చైతన్య యూత్, అధ్యక్షుడు వేగంగా అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పల్లెల్లో అభివృద్ధి వేగంగా సాగుతుంది. అన్ని రంగాల్లో మార్పు వేగంగా జరిగింది. ఇంటింటా సెల్‌ఫోన్ యుగమైంది. గతంలో పోల్చితే.. పల్లె ముఖచిత్రం ఎంతో మారింది. కల్లోల పల్లెల్లో వ్యవసాయ విస్తరణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. – కెంద గంగాధర్, గ్రామ సర్పంచ్ -
రైతులకు అండగా ఉండటమే మా లక్ష్యం
-
ఆశ్రమ పాఠశాల ఖాళీ
ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు కోనరావుపేట : మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఖాళీ అయింది. భూక్యా స్వామి అనే ఏడో తరగతి విద్యార్థి సెల్‌ఫోన్ చార్జర్ విషయంలో ప్రధానోపాధ్యాయుడి మందలింపుతో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. దీంతో విద్యార్థులు షాక్ నుంచి తేరుకోలేదు. తోటి విద్యార్థి మృతి, వార్డెన్ సహా వంట మనుషులు, ఉపాధ్యాయులు సస్పెండ్ కావడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలోకి చేరారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆదివారం ఆశ్రమ పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. వారితో పాటే మిగితా విద్యార్థులు కూడా వెళ్లిపోయారు. మొత్తం 64 మంది విద్యార్థులున్న పాఠశాల ఒక్కసారిగా బోసిపోయింది. ఈవిషయమై ఎంఈవో రఘుపతి మాట్లాడుతూ పాఠశాలను యథావిధిగా కొనసాగించేందుకు గిరిజన సంక్షేమ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇతర పాఠశాలలో ఉన్న సిబ్బందిని డెప్యుటేషన్‌పై కోనరావుపేట పంపించేలా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. -
శ్రమజీవనం.. కళాపిపాసుల సౌందర్యం
జానపదం ముద్దుబిడ్డలు కళకు జీవం పోస్తున్న కళాకారులు నేడు ప్రపంచ రంగస్థల, జానపద విజ్ఞాన దినోత్సవం వారు శ్రమజీవు.. ఒగ్గుకథలో ప్రావీణ్యం పొందారు.. జానపదాలు స్మరిస్తూ శ్రామికులకు వినోదం పంచుతున్నారు. ఆదరణ కోల్పోతున్న కళలకు జీవం పోస్తూ కళామతల్లి సేవలో తరలిస్తున్నారు. రెండున్నర గంటలపాటు వినోదం అందించే సినిమాను తలదన్నే రీతిలో ఏకంగా ఎనిమిది గంటలపాటు ఒగ్గుకథను అలవోకగా గానం చేస్తూ ‘ఔరా’ అనిపిస్తున్నారు. ఒగ్గుకథ పితామహుడు మిద్దె రాములు శిష్యులు ఇప్పుడు బోనమెత్తుతున్నారు. సోమవారం ప్రపంచ జానపద విజ్ఞాన, రంగస్థల దినోత్సవం సందర్భంగా కథనం.. – కోనరావుపేట కళకు జీవం పోస్తూ.. ఒగ్గుకథా కళాకారుల ప్రతిభ మహా అద్భుతం. విభిన్న పాత్రలకు జీవం పోస్తూ.. కళామతల్లి సేవకు అంకితమవుతున్నారు. టీవీలు, సినిమాలు, సోషల్ మీడియా నుంచి పోటీ ఎదురైనా వెనుకడుగు వేయడంలేదు. అందని ప్రోత్సాహం సుమారు 80–90 వరకు పురాణ గాథలను అనర్గళంగా ప్రదర్శించే కళాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. ప్రదర్శనలకు ఆహ్వానించేవారు కరువయ్యారు. ఆర్థిక పరిస్థితి క్షీణించి కళాకారులు దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. వృద్ధ కళాకారులకు పింఛన్లు అందింది ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ విషయమే పట్టించుకోవడంలేదు. ఒగ్గుకథకు జీవం పోస్తున్న శంకర్ ఆయన పెద్దగా చదువుకోలేదు. గురువు వద్ద నేర్చుకున్నదీ తక్కువే. అతను కథలను పుస్తకాలలో చూసుకుంటూ చెప్పలేడు. రజక వృత్తిలో ఉన్నా ఒగ్గుకథనే తన కులవృత్తిగా ఎంచుకున్నాడు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఒగ్గుకథ చెబుతూ అంతరించిపోతున్న కళలకు జీవం పోస్తున్నాడు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పథకాల ప్రచారం కోసం కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. పలువురి ప్రశంసలను అందుకుంటున్నాడు మారుపాక శంకర్. కనగర్తికి చెందిన మారుపాక శంకర్ మిద్దె రాములు శిష్యుడు. మారుపాక ముత్తయ్య–లచ్చవ్వ దంపతుల నాలుగో సంతానం శంకర్. తండ్రి బట్టలుతికేవాడు. ఒకసారి మిద్దె రాములు ఒగ్గుకథ చెప్పడానికి గ్రామానికి వెళ్లారు. ఆయన కథ, చెప్పిన విధానం నిశితంగా పరిశీలించిన శంకర్ ఒగ్గుకథపై ఆసక్తి పెంచుకున్నాడు. మిద్దె రాములు బృందంలో చేరి గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ కథలు చెప్పడం నేర్చుకున్నాడు. సుమారు వంద కథలు అనర్గళంగా చెప్పడం నేర్చుకున్న తర్వాత.. తానే స్వయంగా ప్రదర్శనలివ్వడం ప్రారంభించాడు. రేణుకా ఎల్లమ్మ, మల్లన్న, బీరప్ప, నల్లపోచమ్మ, భక్త పుండరీక, సత్యహరిశ్చంద్ర, సత్యసావిత్రిలాంటి కథలు ఎక్కడా చదవకుండా, చూడకుండా ప్రదర్శన ఇస్తాడు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్మభూమి తదితర పథకాలలో ఒగ్గుకథను ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ప్రభుత్వాధికారులు ఎయిడ్స్, కుటుంబనియంత్రణ వంటి కార్యక్రమాలలో శంకర్‌చే ఒగ్గుకథల ప్రదర్శర నలు ఇప్పించారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ఇటీవలి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఉత్తమ కళాకారునిగా అవార్డు పొందాడు. రాణిస్తున్న బీరయ్య కనగర్తి గ్రామానికి చెందిన జాప మల్లయ్య–దేవవ్వ దంపతుల కుమారుడు బీరయ్య. గజ్జె కట్టి గళం విప్పితే వేదిక సందడి చేస్తుది. నిరక్షరాస్యుడైన బీరయ్య.. తలపై బోనం ఎత్తితే శివసత్తుల సిగాలతో ఊరూరా జాతరే. తలపై బోనం ఎత్తుకుని నాట్యమాడుతూ నేలపై ఉన్న నాణాన్ని నాలుకతో అందుకోవడం ఆయన ప్రత్యేకత. బీరయ్య చిన్నతనం నుంచి ఒగ్గుకథపై మక్కువ పెంచుకున్నాడు. హన్మాజీపేటకు చెందిన ఎరుకలి పోచయ్య, వేములవాడకు చెందిన బుగ్గయ్య వద్ద శిష్యుడిగా చేరి కొంత కాలం శిక్షణ పొందాడు. సుమారు 90 కథలు నేర్చుకుని సొంతంగా కథలు చెప్పడం ప్రారంభించాడు. మల్లన్న, ఎల్లమ్మ పట్నాలు వేయడంలో నేర్పరి. 22 ఏళ్లుగా ఒగ్గుకథకే అంకితమయ్యాడు. అనేక ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఏడేళ్ల క్రితం తెలంగాణ ధూంధాంలో ఒగ్గుకథ చెప్పి కేసీఆర్ ద్వారా సన్మానం పొందాడు. సిద్దిపేట, మంథని, వరంగల్, మంచిర్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాల్లో ఒగ్గుకథ ప్రదర్శనలు ఇచ్చాడు. కథలు చెప్పడమే తన జీవనాధారమని బీరయ్య పేర్కొన్నాడు. -
మైనర్ పై అత్యాచారం-నిందితులపై నిర్భయ కేసు
వీణవంక(కరీంనగర్) : మైనర్‌పై ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న వ్యక్తిపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువకుడే కాకుండా అదే గ్రామానికి చెందిన మరో నలుగురు యువకులు.. ఆ విషయం తమకు తెలుసని, తమతో సహకరించకపోతే అందరికి చెప్తామని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కరీనంగర్ జిల్లా కోనరావుపేట మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో.. అమ్మమ్మ వద్ద ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గత మే నెలలో చెరువు కట్ట వద్ద ఒంటరిగా ఉన్న బాలికపై అదే గ్రామానికి చెందిన నిమ్మల కుమారస్వామి, నిమ్మల కళ్యాణ్, దూలం శ్రీకాంత్, పూదరి మొండయ్య అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. దీంతో బాలిక జరిగిన ఘోరాన్ని ఎవరికి చెప్పుకోలేక పోయింది. మరో 25 రోజుల క్రితం గ్రామ శివారులో వంట చెరుకు కోసం బాలిక వెళ్లగా నిమ్మల వినోద్ లైంగిక దాడికి పాల్పడి, బెదిరించడంతో అప్పుడు ఎవరికి చెప్పుకోలేకపోయింది. చివరికి విషయం కుల పెద్దల దృష్టికి వెళ్లటంతో వారు పోలీసులను ఆశ్ర యించారు. పోలీసులు గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. ఆ మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు వారిపై నిర్భయ కేసు నమోదు చేశారు. లైంగికదాడిలో మరో ముగ్గురిప్రమేయం కూడా ఉన్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
బీడీ కార్మికుల ఆందోళన
కోనరావుపేట (కరీంనగర్ జిల్లా) : తమ సమస్యలను తీర్చాలని కోరుతూ బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన సోమవారం కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో జరిగింది. ఈ ఆందోళనలో భాగంగా బీడీ కార్మికులు మండలంలోని పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.