
పాప అదృశ్యం.. బంధువుల ఆందోళన
నిజామాబాద్ టౌన్: నిజామాబాద్ టౌన్ లోని పవన్‌నగర్‌కు చెందిన అనిత అనే మహిళ తన పాపకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ పాపను ఎత్తుకెళ్లి పోయారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ పాప అదృశ్యమైందని బంధువులు శుక్రవారం నాడు ఆందోళనకు దిగారు.
పాప కనిపించకుండా పోయినప్పటి నుంచి వారి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఆరురోజుల పాప నిన్న(గురువారం) సాయంత్రం అదృశ్యమైన సంగతి తెల్సిందే.