అధికారులతో కలెక్టర్ వాకాటి కరుణ సమీక్ష
హన్మకొండ అర్బన్: చేర్యాల డివిజన్‌లోని 27 గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ వాటర్‌గ్రిడ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామాల నంచి కొంతమంది యువతను ఎంపికచేసి, మెరుున్ పైపులైన్‌ను అనుసంధానిస్తూ ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వడంలో శిక్షణ ఇప్పించాలన్నారు.
ఇందుకుగానూ ఆయూ గ్రామాల సర్పంచ్‌ల సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు పనులు చేపడుతున్న ఎన్‌సీసీ ఏజెన్సీ.. నల్లా కనెక్షన్లు ఇచ్చే పద్ధతిపై యువతకు శిక్షణ అందిస్తుందన్నారు. మిషన్ భగీరథ పనులు పల్లెల్లో పండుగ వాతావరణాన్ని తలపించేలా జరగాలన్నారు. కార్యక్రమంలో వాటర్ గ్రిడ్ ఎస్‌ఈ ఏసురత్నం, ఎన్‌సీసీ ప్రాజెక్టు మేనేజర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
మిషన్’ను వేగవంతం చేయండి
Published Thu, Apr 28 2016 2:39 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
Advertisement