
సీఎం కోలుకోవాలని ‘రాజన్న’కు కోడెమొక్కు
ఎమ్మెల్యే దంపతుల పూజలు
వేములవాడ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు త్వరగా కోలుకోవాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే సిహెచ్.రమేశ్‌బాబు, ఆయన సతీమణి మరియా మంగళవారం ఉదయం ఎములాడ రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కోడెను కట్టేసి మొక్కున్నారు. ద్దాల మంటపంలో ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు స్వామివారి ప్రసాదం అందించి ఆశీర్వదించారు.