రైలు కింద పడి తల్లి కొడుకు ఆత్మహత్య | Mother commits suicide with son on railway track in Mahabubnagar district | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి తల్లి కొడుకు ఆత్మహత్య

Published Wed, Jul 9 2014 8:43 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Mother commits suicide with son on railway track in Mahabubnagar district

మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం అజ్జకొల్లులో విషాదం చోటు చేసుకుంది. గత అర్థరాత్రి మూడేళ్ల కొడుకుతో కలసి తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం తెల్లవారుజామునా స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు.

 

మృతదేహలను పోస్ట్మార్టం నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మృతుల వివరాలను పోలీసులు స్థానికుల నుంచి సేకరిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే తల్లి కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement