నల్లగొండ: రెండేళ్ల చిన్నారితోపాటు ఓ తల్లి రైలు కిందపడి మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున తల్లీకూతుళ్ల మృతదేహాలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, పట్టాలు దాటుతుంటే రైలు ఢీకొని మృతిచెంది ఉంటారా లేక కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందా అనే వివరాలు, వారి పేర్లు తదితర సమాచారం తెలియరాలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.