సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో దుబాయ్‌లో చిక్కుకు న్న కేన్సర్ బాధితుడికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేయూతనిచ్చారు. దీంతో బుధవారం ఆ వ్యక్తి తన స్వస్థలానికి చేరుకున్నాడు. నిజామాబాద్ జిల్లా మోపా ల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చిన్నారెడ్డికి గత డిసెంబర్‌లో కేన్సర్ ఆపరేషన్ జరిగింది. తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి రావాల్సిన బకాయిల కోసం 3 నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. 15 రోజులకు సరిపడా మందులు తీసుకెళ్లిన ఆయనకు లాక్‌డౌన్ రూపంలో కష్టాలు మొదలయ్యాయి. దుబాయ్‌లో మందులు దొరక్క, కీమోథెరపీ జరగక ఇబ్బందులు పడ్డాడు.
భారత్‌కు వచ్చేందుకు అవకాశం లేకపోవడం తో చిన్నారెడ్డి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. తనను ఆదుకోవాలని భారత్ వెళ్లేందుకు సాయం చేయాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా మాజీ ఎంపీ కవితకి విజ్ఞప్తి చేశాడు. చిన్నారెడ్డి కుటుంబ స భ్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్.. కవితను సం ప్రదించారు. దీనిపై స్పందించిన ఆమె వెంటనే ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ చేయించారు. దీంతో బుధవారం శంషా బాద్ ఎయిర్‌పోర్టుకి చేరుకున్న చిన్నారెడ్డిని తెలంగాణ జాగృ తి రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, కవిత సూచనల మేరకు స్వగ్రామం వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. జాగృతి బాధ్యుల వినతి మేరకు చిన్నారెడ్డిని స్వగ్రామం బోర్గాంలో హోం క్వా రంటైన్‌లో ఉండేందుకు అధికారులు అనుమతించారు. భారత్‌కు వచ్చేందుకు సహకరించిన మాజీ ఎంపీ కవితకు చిన్నారెడ్డి, అతని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment