ప్రతీ పనికి కొంత చెల్లించాల్సిందే..
♦ ఆయన చెప్పినంత ఇవ్వాల్సిందే..!
♦ సామాన్యులకు నరకం
♦ సిబ్బందికి తప్పని తిప్పలు
♦ బదిలీ కోసం ప్రయత్నాలు
♦ కాజీపేట సర్కిల్ ఆఫీస్‌లో అధికారి లీలలు
సాక్షి, హన్మకొండ : వరంగల్ మహా నగర పాలక సంస్థకు చెందిన కాజీ పేట సర్కిల్‌లోని ఉన్నతాధికారి అవినీతి భాగోతం పెచ్చుమీరుతోంది. నగరపాలక సంస్థ పరిధిలో 200 గజాల విస్తీర్ణంలోపు కొత్త భవనాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నా, కొత్త ఇంటి నంబర్ల కేటాయింపు, పేరు మార్పిడి ఇలా పనేదైనా ఆ అధికారి సంతకమే కీలకం. దీంతో ఆ అధికారి ప్రతి పనికీ ఓ ధర ముందే సిద్ధం చేశాడు. వివిధ పను ల మీద వచ్చే ప్రజలు ఫైలుతోపాటు పైసలు ఇవ్వాల్సిందేనంటూ అనధికారిక హుకుం జారీ చేశాడు. తన ఆదేశాలు పాటించాల్సిందేనంటూ కింది స్థాయి సిబ్బందికి కరాకండిగా చెప్పేశాడు.
దీనితో కొంతకాలంగా ఆ అధికారి అడిగినంత ఇస్తేనే దస్త్రం ఇక్కడ కదులుతోంది. లేదంటే అ న్నీ ఉన్నా ఆమోదముద్ర పడటం లేదు. పోనీ ఎంతో కొంత ఇచ్చి పని చ క్కబెట్టుకుందామనుకుంటే కుదరడ టం లేదు. తాను ఫిక్స్ చేసిన రేటుకు సొమ్ములు చెల్లించాల్సిందే. సాధారణ పనులకు అధికారుల చేయి తడపాల్సి రావడంతో ఇ క్కడికి వచ్చే ప్రజల నుంచి నిత్యం ప్రతిఘటన ఎదురవుతోంది. జీతాలు తీసుకుంటున్నారు కదా? మళ్లీ మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలంటూ దరఖాస్తుదారులు ప్ర శ్నిస్తుండటంతో క్షేత్రస్థాయి సిబ్బంది పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.
మేం ఇక్కడ పనిచేయలేం..
ప్రతీరోజు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పరిష్కారమయ్యాయి? వాటి ఆధారంగా కలెక్షన్లు ఎంత రావాలనే విధంగా అధికారి ప్రవర్తిస్తుండటంతో విధిగా ప్రజల నుంచి సొమ్ములు వసూలు చేసి కిందిస్థాయి సిబ్బంది ఇ స్తున్నారు. పై అధికారిని సంతృప్తి పరిచేందుకు కింది స్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ సిబ్బంది పరిస్థితి మరీదీనంగా ఉంది. అడిగినంత సొమ్ములు రాలేదంటూ ఫైళ్ల పరిష్కారంలో తాత్సారం చేస్తుండటంతో ఎక్కడి దస్త్రాలు అక్కడే పేరుకుపోతున్నాయి.
పరిస్థితి ఇలానే కొనసాగితే దరఖాస్తుదారుల్లో ఎవరైనా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తే.. తాము లేనిపోని చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వస్తోందని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమను కాజీపేట సర్కిల్ కార్యాలయం నుంచి బదిలీ చేయాలని లేదటే సెలవుల్లో వెళ్తామంటూ పలువురు ఉద్యోగులు ప్రధాన కార్యాలయంలో చుట్టూ ప్రదక్షణలు చేస్తుండటం ఇక్కడి అవినీతి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఆయన రూటు సెప‘రేటు’!
Published Tue, Apr 7 2015 1:25 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement