నా కొడుకు తెలంగాణ అమరవీరుడే.. | My son Telangana martyrs, says koyada vikram's father koyada bavu | Sakshi
Sakshi News home page

నా కొడుకు తెలంగాణ అమరవీరుడే..

Published Fri, Jun 13 2014 9:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

My son Telangana martyrs, says koyada vikram's father koyada bavu

తెలంగాణ ఉద్యమంలో మరణించిన తన కుమారుడి పేరును జిల్లా అమరవీరుల జాబితాలో చేర్పించి న్యాయం చేయాలని పెద్దపెల్లి మండలం రంగాపూర్‌కు చెందిన కొయ్యడ బావు గురువారం కలెక్టర్ వీరబ్రహ్మయ్యను కలిసి వేడుకున్నారు. తన కుమారుడు విక్రమ్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ రాష్ట్ర ఏర్పాటులో జాప్యంతో 2010 జూన్ 27న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

 

ఈ విషయమై దర్యాప్తు జరిపిన బసంత్‌నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నాడు. చేతికందివచ్చిన కుమారుడి మరణంతో తమ కుటుంబం దీనస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి పేరు అమరుల జాబితాలో చేర్చి చేయూతనందించాలని కోరాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement