నల్గొంగ జిల్లా
సాక్షి, నల్లగొండ : ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలు వుంది. అది ఎంతో ప్రాముఖ్యమైనది కూడా. సామాన్యుడికి అదో వజ్రాయుధం లాంటిది. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేయాల్సిందే.అయితే ఓటరు జాబితాలో మొదటి ఓటరు మాత్రం ఓటు వేసిన మధుర స్మృతి ఎప్పటికీ మిగిలిపోనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొదటి ఓటరు అవకాశం దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామంలోని మొదటి పోలింగ్ బూత్‌లోని మొదటి ఓటరుగా సుగుణాబాయికి అవకాశం దక్కింది. జిల్లాలోనే మొదటి ఓటరుగా ఆమెకు అవకాశం లభించడం, మొదటి ఓటు వేయడం ఎంతో ఆసక్తిని కలింగించనుంది. చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామంలో జిల్లాలోని మొదటి పోలింగ్ బూత్ అది. ఆ బూత్‌లోనే మొదటి ఓటరు మొదట ఓటు వేసే అవకాశం లభించింది. సుగుణాబాయి ఓటరు ఐడీ కార్డు నంబర్ టీఐసీ1199504. అయితే ఈమె జిల్లాలోనే మొదటి ఓటు వేయడంతోపాటు దేవరకొండ నియోజకవర్గంలో కూడా మొదటి ఓటు ఆమెనే వరించినట్లయింది.
జిల్లాలో మొత్తం 12లక్షల 87వేల 370 మంది ఓటర్లు ఉన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో 2లక్షల 13వేల 256 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 86వ నియోజకవర్గం దేవరకొండది. అయితే ఓటరు జాబితాలో సుగుణాబాయి మొదటి ఓటరైంది. ఓటరు జాబితాలో మొదటి ఓటరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. అదొక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోనుంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొదటి పోలింగ్ బూత్‌లలో మొదటి ఓటరుగా ఒక్కొక్కరికీ అవకాశం లభించింది.
జిల్లా- దేవరకొండ
నియోజకవర్గ మొదటి ఓటరు..
దేవరకొండ నియోజకవర్గం–86 లోని చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామంలోని
పోలింగ్ బూత్ నెంబర్ 1లో ఓటర్ల జాబితాలో మొదటి ఓటరు సుగుణాబాయి ఓటర్ ఐడీ నంబర్ టీఐసీ1199504
నాగార్జున సాగర్–87...
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నడికుడ గ్రామంలో మొదటి పోలింగ్‌బూత్‌లోని ఓటరు జాబితాలో మొదటి ఓటరు ఓటును బదిలీ చేసుకుంది. దాంతో 2వ ఓటరు కట్టెబోయిన రేణుక మొదటి ఓటరైంది. ఆమె ఓటర్ ఐడీ నంబర్ కేకే1057364.
మిర్యాలగూడ– 88...
మిర్యాలగూడ నియోజకవర్గంలో పాములపహాడ్ గ్రామంలోని మొదటి పోలింగ్ బూత్‌లో మొదటి ఓటరు మైబీ మహ్మద్. ఆమె ఓటర్ ఐడీ నంబర్ యుజేక్యూ1347989.
మునుగోడు–93...
మునుగోడు నియోజకవర్గం పరిధిలోని జైకేసారం గ్రామంలోని మొదటి పోలింగ్ బూత్‌లోని ఓటర్ల జాబితాలో మొదటి ఓటరు సాయమ్మ రుద్రగోని మొదటి ఓటును వేయనుంది. ఓటర్ ఐడీ నంబర్ ఏపీ 41292055207.
నల్లగొండ– 92...
నల్లగొండనియోజకవర్గ పరిధిలోని చందనపల్లి గ్రామంలోని మొదటి పోలింగ్‌స్టేషన్ పరిధిలోని ఓటరు జాబితాలోని మొదటి ఓటరు ఓటు బదిలీ చేసుకోవడంతో రెండవ ఓటరు అయిన పాలడుగు రాములమ్మ మొదటి ఓటు వేయనుంది. ఆమె ఓటర్ ఐడీ నంబర్ హెచ్‌డీవీ3663036.
నకిరేకల్–95...
నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని తుమ్మలగూడెం గ్రామంలోని మొదటి పోలింగ్ బూత్‌లోని మొదటి ఓటరు పురం యశోధ మొదటి ఓటు వేయనుంది. ఓటర్ ఐడీ నంబర్ ఏపీ422900318118.
ఈ ఆరు నియోజకవర్గాల పరిధిలోని మొదటి ఓటర్లుగా వీరు మొదటి ఓటు వేసేందుకు అవకాశం లభించింది. వీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వారికి ఇది తీపి గుర్తుగా మిగిలిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment