కరీంనగర్ జిల్లాలోని గాంధీ నగర్‌లో ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని గాంధీ నగర్‌లో ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. గాంధీనగర్ నర్సరీలో రెండు వారాల వయస్సు ఉన్న బాబును వదలివెళ్లారన్న సమాచారాన్ని అందుకున్న ఐసీడీఎస్ అధికారులు సంఘటానా స్థలానికి చేరుకున్నారు.
అనంతరం 108 వాహనంలో చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాబుకు గ్రహణం ఉండటంతోనే వదిలి వెళ్లినట్లుగా తెలస్తుందని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.