రాష్ట్రంలో సమీకృత జిల్లా పరిపాలన కార్యాలయ భవనాలను రూ.1,032 కోట్లతో నిర్మించనున్నట్లు రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
రూ.1,032 కోట్లతో నిర్మాణం: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమీకృత జిల్లా పరిపాలన కార్యాలయ భవనాలను రూ.1,032 కోట్లతో నిర్మించనున్నట్లు రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 21 కొత్త జిల్లా కేంద్రాలతోపాటు ఏడు పాత జిల్లా కేంద్రాల్లో వీటిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త కలెక్టరేట్ భవనాలపై నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)లో రోడ్లు భవనాల శాఖ అధికారులతో మంగళవారం మంత్రి సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్, ఆదిలాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, కొత్తగూడెం, కామారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రూ.388.50 కోట్లతో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంలో.. వికారాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, నిర్మల్, సూర్యాపేట, మెదక్, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి, వనపర్తి, జగిత్యాల, వరంగల్ రూరల్, మంచి ర్యాల,
గద్వాల, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భూపాలపల్లిల్లో రూ.525 కోట్లతో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టరేట్ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, డీఆర్‌ఓలు, ఇతర అధికారుల కోసం రూ.118.50 కోట్లతో భవనాలు నిర్మిస్తున్నామన్నారు.