లారీ ఢీకొని నవవరుడు మృతి | Newly married Groom dies in Road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని నవవరుడు మృతి

Published Tue, May 22 2018 9:49 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Newly married Groom dies in Road accident - Sakshi

శేఖర్‌ మృతదేహం(ఎడమ), శేఖర్‌(ఫైల్‌)

మెట్‌పల్లిరూరల్‌(కోరుట్ల): మండలంలోని మారుతినగర్‌ సమీపంలో 63వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవరుడు మృతిచెందాడు. పెళ్లై నెలరోజులైనా గడవకముందే వారింట విషాదం చోటుచేసుకుంది. ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన మొండెద్దుల రాజశేఖర్‌(24)కు మెట్‌పల్లి పట్టణంలోని బీడీకాలనీకి చెందిన సంధ్యతో గతనెల 30న వివాహం అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం అత్తగారిళ్లయిన మెట్‌పల్లికి వచ్చాడు. అక్కడి నుంచి తన భార్య సంధ్యతో సోమవారం సాయంత్రం మోటార్‌సైకిల్‌పై కోరుట్ల వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో పైపులు తీసుకెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రాజశేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సంధ్య గాయాలపాలైంది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement