జిల్లా కలెక్టరేట్‌కు నామినేషన్ వేసేందుకు వచ్చిన రైతు
సాక్షి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం ముగిసింది. వివిధ కారణా ల వల్ల 12 మంది అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లను తిరస్కరించామని ఎన్నికల రిటర్నిం గ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ప్రకటించారు. 191 మంది అభ్యర్థుల నామినేషన్లు సవ్యంగా ఉన్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు వెల్లువలా వచ్చాయి. మొత్తం 203 మంది అభ్యర్థులు 245 నామినేషన్లు దాఖలు చేసిన విష యం విధితమే. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, కొందరు స్వతంత్రులు కూడా ఒకటి కంటే ఎక్కువ సెట్లు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగింది.
ఇందులో 12 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, అన్నీ సక్రమంగా ఉన్న 191 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. తిరస్కరణకు గురైన నామినేషన్‌లన్నీ స్వతంత్ర అభ్యర్థులవే. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు సరిగ్గా ఉండటంతో ఏ ఒక్కటీ కూడా తిరస్కరణకు గురికాలేదు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు, బహుజనముక్తి, జనసేన, పిరమిడ్, సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ వంటి పార్టీల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 11 గంటలకు ప్రారం భమైన పరిశీలన ప్రక్రియ సాయంత్రం 7 గంటల వరకు నిర్విరామంగా సాగింది. అభ్యర్థులను ఒక్కొక్కరిగా పిలిచించి తిరస్కరణకు గల కారణాలను అధికారులు వివరించారు. అంతకుముందే వారికి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పకడ్బందీగా ఈ పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు.
తిరస్కరణకు ఇవీ కారణాలు..
నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడంతో 12 నామినేషన్లను తిరస్కరణకు గురయ్యాయి. ఫాం–26ను పూర్తి స్థాయిలో నింపకపోవడంతో చాలా మట్టుకు
అవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎంతమందైనా నామినేషన్లు వేసుకునే హక్కు ఉంటుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం పసుపుబోర్డు సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశామని, పాదయాత్రలు, నిరాహార దీక్షలు చేపట్టామని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్న అంశమని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రైతుల నామినేషన్ల వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆరోపించారు.
టీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్న డి శ్రీనివాస్ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్న వారితో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మునిపల్లి సాయిరెడ్డి నామినేషన్ వేయించడం ఇందుకు ఉదాహరణ అని అన్నారు. డిపాజిట్లు కూడా రావనే భయంతో భువనగిరికి వెళ్లిన మధుయాష్కిని ఇక్కడికి తీసుకువచ్చారని, పోచమ్మ ముందు పొట్టేలును కట్టేసిన చందంగా మధుయాష్కిని బలి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బిగాల గణేష్‌గుప్త మాట్లాడుతూ పదేళ్లు ఎంపీగా పనిచేసిన మధుయాష్కికి పసుపుబోర్డు అంశం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఓటమి ఖాయమని భావించిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కవిత మెజారిటీని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు. ఎంపీగా కవిత తన హక్కులను సంపూర్ణంగా వినియోగించుకుని పసుపుబోర్డు సాధనకు ప్రయత్నించారని మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి తదితరుల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment