Election Nominations 2019
-
మున్సిపల్ ఎన్నికలు.. నేడు ఈసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పురపోరుపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక నిర్ణ యం తీసుకోనుంది. ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఎన్నికల నగారా ఎప్పుడు మోగిస్తారనే దానిపై స్పష్టతనిచ్చే అవకాశముంది. నవంబర్‌లో ఎన్నికలు జరపాలని కృతనిశ్చయంతో ఉన్న సర్కార్.. న్యాయపరమైన చిక్కులు వీగిపోయేలా పావులు కదుపుతోంది. పురపాలక సంఘాల ఎన్నికలకు అడ్డంకిగా ఉన్న ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. 78 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు నిలుపు దల చేస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం విధించిన స్టే ఉత్తర్వులు తొలిగిపోయేలా 3 రోజల క్రితం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరగనుంది. ఈ కేసులో కూడా తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం ఎన్నికల నిర్వహించడానికి సన్నాహాలను ముమ్మరం చేసింది. ఏ క్షణమైనా నోటిఫికేషన్.. గత శాసనసభ ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితానే పురపోరులోను వాడనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. ఈ మేరకు వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్ బూత్‌ల ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది నియామకం, ఇతరత్రా ఏర్పాట్లపై కలెక్టర్లు, కమిషనర్లతో సమీక్షించనుంది. ఎన్నికల సన్నద్ధతపై అధికారులిచ్చే సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే.. ఎస్ఈసీ ఈ నెలాఖరులోగా పురభేరి మోగించనుంది. కాగా, ప్రభుత్వం మాత్రం గురువారం న్యాయస్థానం విచారించే కేసుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై తుది అడుగు వేయనుంది. ఒకవేళ ఆ రోజే తీర్పు వెలువడితే.. మూడు రోజుల్లో రిజర్వేషన్ల క్రతువును పూర్తి చేసి.. ఈసీకి జాబితాను ఇవ్వనుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ ప్రకటించనుంది. కాగా, మీర్‌పేట నగర పాలక సంస్థ ఎన్నికలపై మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. -
హుజూర్నగర్ ఉప ఎన్నిక : నోటిఫికేషన్ విడుదల
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. నేటి(సెప్టెంబర్ 23) నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 3 వరకు ఉపసంహరణ జరగనుంది. అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించి.. 24వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు అధికారులు హుజూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యడం తో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. హుజూర్ నగర్ కు పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావటంతో కాంగ్రెస్ ,టీఆర్ఎస్ ఇరు పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. నల్గొండ ఎంపీ స్థానం పోగొట్టుకున్న టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు బరిలోకి ఉత్తమ్ సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతిని దింపనుంది. ఇక రాష్ట్రంలో పట్టుసాదించడం కోసం తహ తహలాడుతున్న బీజేపీ గట్టి అభ్యర్థిని వెతికే పనిలో పడింది. -
నంద్యాల బరిలో అత్యధికంగా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల ఎన్నికలకు 344 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో రెండు పార్లమెంటు స్థానాలున్న కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 36 మంది పోటీలో నిలిచారు. అత్యధికంగా నంద్యాల పార్లమెంటు సీటు నుంచి 20 మంది అభ్యర్థులు పోటీలో నిలుచున్నారు. తర్వాత 19 మంది బరిలో నిలుచోవడం ద్వారా గుంటూరు పార్లమెంటు రెండో స్థానం, 16 మందితో కర్నూలు మూడో స్థానంలో ఉన్నాయి. అత్యల్పంగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి 8 మంది మాత్రమే బరిలో ఉన్నారు. హిందూపురం, రాజంపేట, శ్రీకాకుళం స్థానాల్లో తొమ్మిది మంది చొప్పున అభ్యర్థులు ఉన్నారు. మిగిలిన స్థానాల్లో పది మందికి తక్కువ కాకుండా స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ రెండు ఈవీఎంలు వాడాల్సిందే.. ఒక్క ఈవీఎం మిషన్‌లో (బ్యాలెట్ యూనిట్) గరిష్టంగా 16 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే పడతాయి. నోటా గుర్తును పరిగణనలోకి తీసుకుంటే 15 మంది అభ్యర్థులు దాటితే అదనపు ఈవీఎంలు వినియోగించాల్సి వస్తుంది. ప్రస్తుతం పార్లమెంటు సీట్లల్లో బరిలో నిలుచున్న అభ్యర్థుల ప్రకారం నంద్యాల (20), గుంటూరు (19), కర్నూలు (16) సీట్లలో 15కు మించి అభ్యర్థులు బరిలో ఉండటంతో ఇక్కడ రెండు ఈవీఎంలు వినియోగించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఏకంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో అక్కడ ఏకంగా 12 ఈవీఎంలు వినియోగిస్తున్నారు. తగ్గిన స్వతంత్రుల సందడి ఈసారి చాలా పార్లమెంటు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల సందడి తక్కువగా ఉంది. 5 ప్రధాన పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేనలతో పాటు ఇతర నమోదిత పార్టీలు అనేకం పోటీలో ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులు తక్కువగా పోటీలో ఉండటానికి కారణంగా రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు 95 మంది స్వతంత్రులు మాత్రమే పోటీలో ఉన్నారు. అనకాపల్లి, అమలాపురం పార్లమెంటు స్థానాల్లో ఒకే ఒక స్వతంత్ర అభ్యర్థి రంగంలో నిలుచున్నారు. రాజమండ్రి, ఏలూరు, రాజంపేట, చిత్తూరు నియోజకవర్గాల నుంచి ఇద్దరు చొప్పున మాత్రమే రంగంలో నిలుచున్నారు. -
ఆ నలుగురి నామినేషన్లు తప్పుల తడకే
సాక్షి, తిరుపతి: సీఎం చంద్రబాబు నామినేషన్‌తో పాటు చిత్తూరు జిల్లాలోని మరో ముగ్గురు టీడీపీ అభ్యర్థుల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను కనబరచకుండా దాచిపెట్టారు. అయినా ఆ నలుగురి నామినేషన్లు ఆమోదం పొందాయి. తప్పులను అడగకుండా రిటర్నింగ్ అధికారులు వారి నామినేషన్లు ఎలా ఆమోదించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు తాను నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిగా పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నోటరీని మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన లాయర్ సీతారామ్ చేశారు. తన పరిధిలోకి రాని గ్రామాన్ని నోటరీ ఎలా చేస్తారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని చంద్రగిరి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇతను సమర్పించిన అఫిడవిట్లో పులివర్తి నానికి సంబంధించిన ఆస్తుల వివరాలను దాచిపెట్టారు. పాకాల మండలం ఆదెనపల్లిలో ఖాతా నంబర్ 283తో 32 సర్వే నంబర్లలో సుమారు 10 ఎకరాలు ఉంది. అయితే నోటరీలో 8 సర్వే నంబర్లలో ఉన్న భూమిని మాత్రమే చూపించారు. పులివర్తి నాని భార్య కె.గానసుధ పేరున 1.30 ఎకరాలు ఉన్నట్లు చూపించారు. వాస్తవంగా ఆమె పేరున యాదమర్రి మండలం కుక్కలపల్లిలో సర్వే నంబర్ 510/4ఏలో మొత్తం 3.32 ఎకరాల భూమి ఉంది. సెంటు భూమి లేదు.. వ్యవసాయ ఆదాయం చూపారు గంగాధరనెల్లూరు టీడీపీ అభ్యర్థి గుమ్మడి హరికృష్ణ తనకు వ్యవసాయ భూమి లేదని చూపించారు. అయితే వ్యవసాయం ద్వారా రూ.5,88,650 ఆదాయం చూపించారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ప్లాట్ నంబర్ 153, సర్వే నంబర్ 239/3, 3ఏని చూపించారు. అందులో విస్తీర్ణం, విలువ చూపలేదు. ఇంకా హరికృష్ణ తండ్రి 2014లో ఒక ప్లాట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ ప్లాటు విలువ అప్పట్లో రూ.9 లక్షలు. ప్రస్తుతం ఆ ప్లాటు మార్కెట్ విలువ చూపలేదు. ఇలా నలుగురు అభ్యర్థుల నామినేషన్ పత్రాల్లో అన్ని వివరాలను చూపించారా? లేదా? అని ప్రశ్నించకుండానే అధికారులు ఆమోదించటంపై విమర్శలు వస్తున్నాయి. కాలమ్స్ మాయం తిరుపతి టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ నామినేషన్ వేశారు. అయితే ఈమె సమర్పించిన అఫిడవిట్లో ఉండాల్సిన కాలమ్స్ మాయమయ్యాయి. తన అఫిడవిట్‌లోని 12వ పేజీలో ఉండాల్సిన మూడు కాలమ్స్ కనిపించలేదు. హెచ్‌యూఎఫ్, వారసులు 1, 2, 3 గడులు పూర్తి చేయాలి. అయితే సుగుణమ్మ సమర్పించిన అఫిడవిట్లో అవి కనిపించలేదు. 14వ పేజీలో వివరాలు మాత్రం చూపించారు. హోటల్, కారు, ఎయిర్ కండిషనర్, ఫర్నిచర్స్, మోటార్ వాహనం, ఇతరత్రా చూపించారు. అయితే అవి ఎవరికి చెందినవి అనే వివరాలు పొందుపరచలేదు. ఏడో గడిలో 6, 7, 8లో ఆస్తులను చూపించారు. అవి ఎవరివి అని స్పష్టం చెయ్యలేదు. ఇంకా 550 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపించారు. ఎవరిదనేది స్పష్టం చేయలేదు. -
రెండు నామినేషన్ల తిరస్కరణ.. 18 ఓకే
మెదక్ రూరల్: మెదక్ కలెక్టరేట్లో మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి, ఎన్నికల పర్యవేక్షకుడు సంజయ్ మీనాలు నామినేషన్లను పరిశీలించారు. ఈ స్క్రూటినీలో సరైన పత్రాలు లేని ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. ఇందులో గౌరిగారి ఆగమయ్య(భారతీయ అనరక్షిత్ పార్టీ), సత్యనారాయణరెడ్డి(స్వతంత్ర అభ్యర్థి)ల నామినేషన్లకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో ఆ రెండింటినీ తిరస్కరించామన్నారు. దీంతో మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం బరిలో ప్రస్తుతం 18 మంది ఉన్నట్లు తెలిపారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలనుకునే వారు ఈ నెల 28న మధ్యాహ్నం 3గంటల లోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకోవాలన్నారు. అభ్యర్థి స్వయంగా వచ్చి తమ నామినేషన్‌ను ఉపసంహరించుకోవచ్చని చెప్పారు. ఒకవేళ రాలేకపోతే ఏజెంట్‌గాని లేదా ప్రతిపాదించిన వ్యక్తులు కానీ అభ్యర్థి అంగీకార పత్రాన్ని తీసుకొని రావాలని సూచించారు. 28వ తేదీ మధ్యాహ్నం 3గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తామని చెప్పారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ భవనాలు, ఆస్తులకు సంబంధించిన వాటిని తమ ప్రచారానికి వినియోగించడం నేరమని తెలిపారు. ఇలా చేసే వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామన్నారు. ప్రైవేట్ వ్యక్తుల అనుమతి తీసుకోనిదే వారి ఆస్తులను ఉపయోగించకూడదన్నారు. ప్రస్తుతం పరీక్షల నడుస్తున్నందున ప్రతీ అభ్యర్థి పాఠశాలలు, కళాశాలలు వంటి ప్రదేశాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రచారం చేసుకోవచ్చన్నారు. కుల ప్రతిపాదికన ఓట్లు అడగడంతోపాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం నేరమన్నారు. ప్రచార వాహనాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, డీసీఓ వెంకట్‌రెడ్డి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రత్నాకర్, సూపరింటెండెంట్లు నజీమ్, నారాయణతోపాటు ఇతర అధికారులు ఉన్నారు. ప్రస్తుతం మెదక్ లోక్‌సభ బరిలో నిలిచిన అభ్యర్థులు గాలి అనిల్‌కుమార్(కాంగ్రెస్), మామిళ్ల ఆంజనేయులు(కాంగ్రెస్ రెబల్), కొత్త ప్రభాకర్‌రెడ్డి(టీఆర్ఎస్), మాధవనేని రఘునందన్‌రావు(బీజేపీ), గుండుకాడి కరుణాకర్(ఇండియా ప్రజాబంధు పార్టీ), పోసానపల్లి మైపాల్‌రెడ్డి(ఎస్ఎఫ్బీపీ), కేడీ భరతేష్(సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా), మాధవరెడ్డిగారి హనుమంతురెడ్డి(శివసేన), మెరిగె సంతోష్‌రెడ్డి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), వరికోలు శ్రీనివాస్(సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా) కల్లు నర్సింహాగౌడ్(స్వతంత్ర అభ్యర్థి), కొల్కూరి ప్రతాప్(స్వతంత్ర అభ్యర్థి), గజబీంకర్ బన్సీలాల్(స్వతంత్ర అభ్యర్థి), గొండి భుజంగం(స్వతంత్ర అభ్యర్థి), తుమ్మలపల్లి పృథ్వీరాజ్(స్వతంత్ర అభ్యర్థి), దొడ్ల వెంకటేశ్(స్వతంత్ర అభ్యర్థి), ప్రదీప్‌కుమార్(స్వతంత్ర అభ్యర్థి), బంగారు కృష్ణ(స్వతంత్ర అభ్యర్థి). -
ఆదిలాబాద్‌లో నాలుగు నామినేషన్లు తిరస్కరణ
సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని లోక్‌సభ ఎన్నికల నామినేషన్ కేంద్రంలో రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పరిశీలన ప్రక్రియ కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఆదిలాబాద్ లోక్‌సభకు మొత్తం 21 నామినేషన్లు దాఖలు కాగా, 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే లోక్‌సభ స్థానానికి వచ్చిన నామినేషన్లలో నలుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దివ్యదేవరాజన్ తెలిపారు. మిగతా 13 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా ఉన్నట్లు వివరించారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రితేశ్ రాథోడ్, జాదవ్ నరేశ్, ఆల్ ఇండియా ఫార్వడ్ బ్లాక్ నుంచి భుక్యా గోవింద్, సమాజ్‌వాది ఫార్వడ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన లకావత్ విజయ్‌కుమార్‌ల నామినేషన్లు తిరస్కరించినట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ పరిశీలనలో జేసీ సంధ్యారాణి, సబ్ కలెక్టర్ గోపి, సహాయ కలెక్టర్ ప్రతీక్ జైన్, తహశీల్దార్లు, రాజకీయ, స్వతంత్ర అభ్యర్థుల ప్రతినిధులు పాల్గొన్నారు. 28 వరకు ఉపసంహరణకు గడువు ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 28 వరకు గడువు ఉంది. పరిశీలన అనంతరం 13 అభ్యర్థులు ఉపసంహరణ బరిలో ఉండగా, ఎంత మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించగా, సోమవారం ఒక్క రోజే భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఆఖరి రోజు దాఖలైన నాలుగు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడం విశేషం. పెద్దపల్లిలో పది తిరస్కరణ పెద్దపల్లి: పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసిన 21 మందిలో పది మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు వేర్వేరు కారణాలతో తిరస్కరించారు. నామినేషన్ల స్క్రూటినీ మంగళవారం నిర్వహించారు. కలెక్టర్, రిటర్నింగ్ అధికారి శ్రీదేవసేన, ఎన్నికల పర్యవేక్షణ అధికారి రాజారాం ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రూటినీలో సగంమంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బీజేపీ తరఫున నామినేషన్ వేసిన కొయ్యడ స్వామి బీఫాం, ఏ ఫాం వివరాలు అందించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తరఫున, స్వతంత్య్ర అభ్యర్థిగా గంధం శంకర్ రెండు సెట్ల నామినేషన్ వేశారు. అయితే తన ప్రతిపాదనలు సరిగా చూపకపోవడంతో రెండూ తిరస్కరణకు గురయ్యాయి. సీపీఐఎంఎల్ రెడ్‌స్టార్ అభ్యర్థిగా మల్లేశం నామినేషన్ వేయగా వివరాలు సరిగా లేక అధికారులు తిరస్కరించారు. జనతాదళ్ ఫేం అభ్యర్థి ఎస్.గంగాధర్ దాఖలు చేసిన రెండు సెట్లలో 2 సీకి బదులు 1సీ నింపడంతో రెండు సెట్లు చెల్లుబాటు కాలేదు. దళిత బహుజన్‌పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన క్రాంతికుమార్, తన ఫాం సరిగా నింపకపోవడంతో తిరస్కరించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ అభ్యర్థి ఎం.గణేశ్, భారతీయ అనరాక్షిత పార్టీ అభ్యర్థి బి.వెంకటేశం తమ ఫాంలలో ఏ విభాగాన్ని ఖాళీగా ఉంచడంతో వాటిని కొట్టేశామని అధికారులు తెలిపారు. స్వతంత్య్ర అభ్యర్థులు జె.నరేశ్, రాచర్ల రాజేశం, బొజ్జ దశరథ్ వేసిన నామినేషన్లలో తప్పులు దొర్లడంతోపాటు అఫిడవిట్లు దాఖలు చేయకపోవడం, పార్ట్– 3ఏ లో ఇవ్వాల్సిన వివరాలు సరిగా లేనందున వాటిని కూడా అధికారులు తిరస్కరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే నామినేషన్ల స్క్రుటినీ నిర్వహించి నిబంధనల ప్రకారం లేనివాటిని తిరస్కరించామని రిటర్నింగ్ అధికారి శ్రీదేవసేన తెలిపారు. -
గుంటూరు: నామినేషన్ల పరిశీలన
సాక్షి, అమరావతి బ్యూరో/నగరంపాలెం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన మంగళవారం ఉత్కంఠ మధ్య ముగిసింది. మంగళగిరి, మాచర్ల నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లలో లోపాలపై ఫిర్యాదులు అందడంతో ఉత్కఠ నెలకొంది. గుంటూరు, బాపట్ల, నరసరావుపేట పార్లమెంట్ స్థానాలకు 38 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. మూడు పార్లమెంట్‌స్థానాలకు 14 నామినేషన్లను తిరస్కరించగా, 48 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. 17 అసెంబ్లీ స్థానాలకు 65 నామినేషన్లను తిరస్కరించి, 317 ఆమోదించారు. ఉత్కంఠ నడుమ ఆమోదం మంగళగిరి, మాచర్ల నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు లోకేష్‌బాబు, అంజిరెడ్డి నామినేషన్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) ఫిర్యాదు చేయడంతో ఉత్కంఠత నెలకొంది. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన లోకేష్ తన ఇంటి చిరునామా తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామంగా పేర్కొన్నారు. అయితే నోటరీ చేసింది మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన లాయర్ సీతారామ్, కొంగర సాయి. వారు గుంటూరు జిల్లా పరిధిలోకి రారని, అలాంటప్పుడు ఎలా నోటరీ చేస్తారని ప్రశ్నించడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్కే ప్రశ్నించారు. మాచర్లలో సైతం టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డి మాచర్ల ప్రాంతానికి కాకుండా గురజాలకు చెందిన న్యాయవాదితో నోటరీ చేయించారని, అది చెల్లదని పీఆర్కే వాదించారు. కొద్ది గంటల అనంతరం ఆ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. పెదకూరపాడులో ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్ వేసిన నంబూరు శంకరరావు నామినేషన్‌ను తిరస్కరించారు. చిలకలూరిపేట నూతక్కి రేఖ, నరసరావుపేట తలారి నాని నామినేషన్లను తిరస్కరించారు. వినుకొండ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గంగినేని బ్రహ్మనాయుడు నామినేషన్ వేశారు. అయితే టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లు గలిగినవారితో కుట్ర పూరితంగా ప్రజా శాంతి పార్టీ, తెలుగుదేశం పార్టీతో నామినేషన్లు వేయడం గమనార్హం. బాపట్లలో ఇద్దరు అభ్యర్థులకు జనసేన బీపారాలు ఇవ్వగా, ఇక్కుర్తి నరసింహారావు, పునుగు మధుసూదన్‌రెడ్డికి బీఫారాలు ఇచ్చారు. వారిలో చివరకు పార్టీ ఇక్కుర్తి నరసింహారావు బీఫారాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పునుగు మధుసూదన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట పార్లమెంట్‌కు షేక్ చాంద్‌బాషా, యర్రా ప్రవీణ్‌కుమార్ ఇద్దరు ప్రశాంతి పార్టీ తరఫున నామినేషన్లు వేయగా ఇద్దరివి తిరస్కరించారు. ప్రధాన పార్టీలకు చెందిన నామినేషన్లను మాత్రం తిరస్కరణకు గురి కాలేదు. టీడీపీ అభ్యర్థి నామినేషన్‌పై అభ్యంతరాలు మాచర్లరూరల్: మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ డేవిడ్‌రాజు సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. మొత్తం 18 నామినేషన్లు అందగా, నవక్రాంతి పార్టీ అభ్యర్థి నారె వేములయ్య నామినేషన్‌కు ప్రపోజల్స్ సంఖ్య సరిపడినంత లేకపోవటంతో తిరస్కరించారు. టీడీపీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డి నామినేషన్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో పరిశీలన కార్యక్రమం మూడు గంటలపాటు నిలిచిపోయింది. అంజిరెడ్డి నామినేషన్ పత్రంలో నోటరీకి జతపరచిన ప్రమాణ పత్రంలో నోటరీ ఎదుట ప్రమాణం చేసినట్లు ఉండాల్సిన కాలం ఖాళీగా ఉండటంతో న్యాయవాది బాల సత్యనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటరీ పత్రం జారీ చేసిన అడ్వకేట్ గురజాల మేజిస్ట్రేట్ పరిధికి చెందిన వారు కావటం, మాచర్ల నియోజకవర్గానికి ఆయన ఇచ్చిన నోటరీ చెల్లదని సత్యనారాయణరెడ్డి రిటర్నింగ్ ఆఫీసర్ డేవిడ్‌రాజు ఎదుట అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ నామినేషన్‌ను తిరస్కరించాలని పట్టుబట్టారు. దీంతో మూడు గంటల పాటు పరిశీలన ఆగిపోయింది. అనంతరం చిన్నచిన్న అభ్యంతరాలు ఎన్ని కల కమిషన్ పరిధిలోకి రావంటూ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్‌ను ఆమోదించడంతో న్యాయవాది సత్యనారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, కోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. పరిశీలన అనంతరం 15 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 9 మంది అభ్యర్థులు తిరస్కరణ పెదకూరపాడు: పెదకూరపాడు నియోజకవర్గంలో ఆసెంబ్లీ స్థానానికి 20 మంది నామినేషన్లు సమర్పించగా, 9 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు, టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్, జనసేన పార్టీ అభ్యర్థి పుట్టి లక్ష్మీసాంమ్రాజ్యం, బీజేపీ అభ్యర్థి గంధం కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పమిడి నాగేశ్వరరావు తదితరుల నామినేషన్లు ఆమోదం పొందాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు పేరుతో ఉన్న వ్యక్తితో ప్రజాశాంతి పార్టీ తరఫున అందిన నామినేషన్‌ను సక్రమంగా పూర్తిచేయకపోవడంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో టీడీపీ కుట్రకు చెక్ పెట్టినట్లయింది. -
12 నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం ముగిసింది. వివిధ కారణా ల వల్ల 12 మంది అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లను తిరస్కరించామని ఎన్నికల రిటర్నిం గ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ప్రకటించారు. 191 మంది అభ్యర్థుల నామినేషన్లు సవ్యంగా ఉన్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు వెల్లువలా వచ్చాయి. మొత్తం 203 మంది అభ్యర్థులు 245 నామినేషన్లు దాఖలు చేసిన విష యం విధితమే. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, కొందరు స్వతంత్రులు కూడా ఒకటి కంటే ఎక్కువ సెట్లు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో 12 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, అన్నీ సక్రమంగా ఉన్న 191 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. తిరస్కరణకు గురైన నామినేషన్లన్నీ స్వతంత్ర అభ్యర్థులవే. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు సరిగ్గా ఉండటంతో ఏ ఒక్కటీ కూడా తిరస్కరణకు గురికాలేదు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు, బహుజనముక్తి, జనసేన, పిరమిడ్, సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ వంటి పార్టీల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 11 గంటలకు ప్రారం భమైన పరిశీలన ప్రక్రియ సాయంత్రం 7 గంటల వరకు నిర్విరామంగా సాగింది. అభ్యర్థులను ఒక్కొక్కరిగా పిలిచించి తిరస్కరణకు గల కారణాలను అధికారులు వివరించారు. అంతకుముందే వారికి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పకడ్బందీగా ఈ పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు. తిరస్కరణకు ఇవీ కారణాలు.. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడంతో 12 నామినేషన్లను తిరస్కరణకు గురయ్యాయి. ఫాం–26ను పూర్తి స్థాయిలో నింపకపోవడంతో చాలా మట్టుకు అవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎంతమందైనా నామినేషన్లు వేసుకునే హక్కు ఉంటుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం పసుపుబోర్డు సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశామని, పాదయాత్రలు, నిరాహార దీక్షలు చేపట్టామని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్న అంశమని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రైతుల నామినేషన్ల వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న డి శ్రీనివాస్ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్న వారితో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మునిపల్లి సాయిరెడ్డి నామినేషన్ వేయించడం ఇందుకు ఉదాహరణ అని అన్నారు. డిపాజిట్లు కూడా రావనే భయంతో భువనగిరికి వెళ్లిన మధుయాష్కిని ఇక్కడికి తీసుకువచ్చారని, పోచమ్మ ముందు పొట్టేలును కట్టేసిన చందంగా మధుయాష్కిని బలి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బిగాల గణేష్‌గుప్త మాట్లాడుతూ పదేళ్లు ఎంపీగా పనిచేసిన మధుయాష్కికి పసుపుబోర్డు అంశం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఓటమి ఖాయమని భావించిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కవిత మెజారిటీని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు. ఎంపీగా కవిత తన హక్కులను సంపూర్ణంగా వినియోగించుకుని పసుపుబోర్డు సాధనకు ప్రయత్నించారని మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి తదితరుల పాల్గొన్నారు. -
వైఎస్సార్ కడప: నామినేషన్ల జాబితా
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో లోక్‌సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన మంగళవారం ముగిసింది. ఉదయం నుంచే రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లు పరిశీలించారు. కడప లోక్‌సభకు మొత్తం 24 మంది నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 17 నామినేషన్లు ఆమోదించారు. మిగతా ఏడు నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. రాజంపేట లోక్‌సభకు 20 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 12 నామినేషన్లను ఆమోదించి ఎనిమిదింటిని తిరస్కరించారు. కడప, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో మొత్తం 44 నామినేషన్లకుగాను 29 నామినేషన్లు ఆమోదించి, 15 నామినేషన్లను తిరస్కరించారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు 215 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 161 నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. మిగిలిన 54 నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరించారు. ఈనెల 28వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. బుధవారం సాంయత్రానికి ఎన్నికల చిత్రం స్పష్టమవుతుంది. లోక్‌సభ నియోజకవర్గం నామినేషన్లు ఆమోదం తిరస్కరణ కడప 24 17 07 రాజంపేట 20 12 08 మొత్తం 44 29 15 అసెంబ్లీ నియోజకవర్గాలు నియోజకవర్గం నామినేషన్లు ఆమోదం తిరస్కరణ బద్వేలు 18 14 04 రాజంపేట 22 19 03 కడప 22 16 06 రైల్వేకోడూరు 21 16 05 రాయచోటి 15 10 05 పులివెందుల 23 12 11 కమలాపురం 21 17 04 జమ్మలమడుగు 34 30 04 ప్రొద్దుటూరు 17 14 03 మైదుకూరు 22 13 09 మొత్తం 215 161 54 -
అనంతపురం: ముగిసిన నామినేషన్ల పరిశీలన
సాక్షి, అనంతపురం అర్బన్: జిల్లాలోని రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామినేషన్లను మంగళవారం అధికారులు పరిశీలించారు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలకు 30 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా... ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి 18 మంది నామినేషన్లు దాఖలు చేయగా 14 మంది అభ్యర్థులు నామినేషన్లు ఆమోదం పొందాయి. నలుగురి నామినేషన్లను తిరస్కరించారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి 12 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 9 మంది నామినేషన్లు ఆమోదించారు. ముగ్గురి నామినేషన్లను తిరస్కరించారు. ఇక 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 254 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 190 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. 64 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా నామినేషన్లు తిరస్కరణకు గురైన నియోజకవర్గాలో ధర్మవరం మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో పుట్టపర్తి ఉంది. ధర్మవరం నియోజకవర్గానికి 27 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 12 ఆమోదం పొందాయి. 15 తిరస్కరణకు గురయ్యాయి. ఇక పుట్టపర్తి నియోజకవర్గానికి 28 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా 21 ఆమోదం పొంది, 7 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆమోదం పొందిన ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు అనంతపురం పార్లమెంట్: తలారి రంగయ్య (వైఎస్సార్సీపీ), జేసీ పవన్‌రెడ్డి (టీడీపీ), డి.జగదీశ్ (సీపీఐ), హంస దేవినేని (బీజేపీ), కె.రాజీవ్‌రెడ్డి (కాంగ్రెస్), జి.లలిత (ఎస్‌యుసీఐ) హిందూపురం పార్లమెంట్: గోరంట్ల మాధవ్ (వైఎస్సార్సీపీ), నిమ్మల కిష్టప్ప (టీడీపీ), ఎం.ఎస్.పార్థసారథి (బీజేపీ), కె.టి.శ్రీధర్ (కాంగ్రెస్) పార్లమెంట్ ఆమోదం తిరస్కరణ మొత్తం అనంతపురం 14 4 18 హిందూపురం 9 3 12 14 అసెంబ్లీ స్థానాలకు 190 ఆమోదం, 64 తిరస్కరణ నేడు, రేపు నామినేషన్ల ఉపసంహరణ అనంతపురం అర్బన్: నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారంతో ముగియగా...ఉపసంహరణకు 28వ తేదీ వరకు గడువు ఉంది. దీంతో ఉపసంహరణ ప్రక్రియ బుధు, గురువారాలు కొనసాగనుంది. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలకు 30 మంది నామినేషన్ వేయగా, 23 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. అదే విధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 254 మంది నామినేషన్లు వేయగా 190 ఆమోదం పొందాయి. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. వీరిలో ఎంత మంది ఉపసంహరించుకుంటారో...? ఎంత మంది బరిలో ఉంటారో 28వ తేదీన తేలనుంది. -
245 నామినేషన్లకు ఆమోదం
సాక్షి, చిలకలపూడి(మచిలీపట్నం): సాధారణ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం పరిశీలించారు. ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు, నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు, వారి అనుచరుల సమక్షంలో పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా అభ్యర్థి ఓటు.. ప్రపోజర్ ఓటు పరిశీలనతో పాటు నామినేషన్ పత్రాన్ని పూర్తిస్థాయిలో రాసినదీ, లేనిదీ, పార్టీల ఆమోదపత్రాలు తదితర అంశాలను పరిశీలించి అనంతరం వాటిని ఆమోదించారు. అలాగే ఒక పార్టీ అభ్యర్థి, వేరొక పార్టీ అభ్యర్థి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చునని రిటర్నింగ్ అధికారులు ఆయా పార్టీల నాయకులకు తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా 332 మంది అభ్యర్థులు నామినేషన్లు పరిశీలించగా 245 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. 87 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు అభ్యంతరాలు తెలపటంతో నామినేషన్ల పరిశీలన కార్యక్రామాన్ని బుధవారానికి వాయిదా వేసినట్లు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. నామినేషన్లు ఆమోదించిన అనంతరం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీ ప్రధాన పార్టీలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ♦ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, టీడీపీ అభ్యర్థిగా కొనకళ్ల నారాయణరావు, జనసేన పార్టీ అభ్యర్థిగా బండ్రెడ్డి రామకృష్ణ (రాము) తో పాటు మరో 11 మంది నామినేషన్లను ఆమోదించారు. నలుగురి నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ♦ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొట్లూరి వీరప్రసాద్ (పీవీపీ), టీడీపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్ (నాని), జనసేన పార్టీ అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాద్‌బాబు తో పాటు మరో 12 నామినేషన్లను ఆమోదించారు. ఆరుగురు నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ♦ తిరువూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొక్కిలిగడ్డ రక్షణనిధి, టీడీపీ అభ్యర్థిగా కొత్తపల్లి శామ్యూల్జవహార్ తో పాటు 10 నామినేషన్ పత్రాలను ఆమోదించారు. ఏడుగురివి తిరస్కరించారు. ♦ నూజివీడులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా మేకా వెంకటప్రతాప్ అప్పారావు, టీడీపీ అభ్యర్థిగా ముదరబోయిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ అభ్యర్థిగా బసవ భాస్కరరావుతో పాటు మరో తొమ్మిది నామినేషన్ పత్రాలను ఆమోదించారు. మూడింటిని తిరస్కరించారు. ♦ గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్ తో పాటు మరో 12 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. రెండు నామినేషన్ పత్రాలకు ఆమోదం లభించలేదు. ♦ కైకలూరులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు, టీడీపీ అభ్యర్థిగా జయమంగళ వెంకటరమణతో పాటు మరో 22 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించగా.. మరో ఏడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ♦ పెడనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జోగి రమేష్, టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, జనసేన అభ్యర్థి అంకెం లక్ష్మీశ్రీనివాస్లతో పాటు 14 నామినేషన్ పత్రాలను ఆమోదించారు. మరో మూడు నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ♦ మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పేర్ని వెంకట్రామయ్య (నాని), టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన అభ్యర్థి బండి రామకృష్ణతో పాటు ఆరు నామినేషన్ పత్రాలను ఆమోదించారు. మూడు నామినేషన్లను తిరస్కరించారు. ♦ అవనిగడ్డలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్, టీడీపీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్, జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి కృష్ణారావుతో పాటు పది నామినేషన్ పత్రాలను ఆమోదించారు. ముగ్గురు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ♦ పామర్రులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా కైలే అనిల్‌కుమార్, టీడీపీ అభ్యర్థిగా ఉప్పులేటి కల్పనతో పాటు 11 నామినేషన్ పత్రాలను ఆమోదం లభించగా.. ఐదు నామినేషన్లను తిరస్కరించారు. ♦ విజయవాడ వెస్ట్‌లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థిగా షబనాముస్తరాత్కాతూన్, జనసేన అభ్యర్థిగా పోతిన వెంకటమహేష్తో పాటు 25 నామినేషన్ పత్రాలను ఆమోదించారు. నాలుగు నామినేన్లను తిరస్కరించారు. ♦ విజయవాడ సెంట్రల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లాది విష్ణువర్థన్, టీడీపీ అభ్యర్థిగా బొండా ఉమామహేశ్వరరావుతో పాటు మరో 17 నామినేషన్ పత్రాలను ఆమోదించారు. నాలుగు నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ♦ విజయవాడ ఈస్ట్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొప్పన భవకుమార్, టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్‌తో పాటు పది నామినేషన్ పత్రాలను ఆమోదించారు. 17 నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ♦ మైలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్, టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేనఅభ్యర్థిగా అక్కల రామ్మోహనరావుతో పాటు మరో 17 నామినేషన్ పత్రాలను ఆమోదించారు. నాలుగు నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ♦ నందిగామలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా మొండితోక జగన్మోహన్, టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్యతో పాటు తొమ్మిది నామినేషన్ పత్రాలను ఆమోదించారు. మరో ఐదు తిరస్కరణకు గురయ్యాయి. ♦ జగ్గయ్యపేటలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను, టీడీపీ అభ్యర్థిగా శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)తో పాటు పది నామినేషన్ పత్రాలను ఆమోదించారు. మరో ఎనిమిది నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. -
పశ్చిమ గోదావరి జిల్లా: నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం మీద 52 నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో పార్లమెంట్‌కు సంబంధించి ఐదు నామినేషన్లు ఉండగా, 47 నామినేషన్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినవి. ఏలూరు, నర్సాపురం లోక్‌సభకు సంబంధించి 32 నామినేషన్లు దాఖలు కాగా ఐదు తిరస్కరణకు గురి కావడంతో ప్రస్తుతం 27 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకారం పొందాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 234 మంది నామినేషన్లు దాఖలుకాగా అందులో 47 నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో 187 నామినేషన్లు అంగీకారం పొందాయి. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు అన్నీ ఆమోదం పొందాయి. తిరస్కరణకు గురి అయిన నామినేషన్లలో ఎక్కువ శాతం డమ్మీ అభ్యర్థులవే ఉన్నాయి. పార్లమెంట్ స్థానం మొత్తం నామినేషన్లు ఆమోదం తిరస్కరణ నర్సాపురం 20 17 3 ఏలూరు 12 10 2 అసెంబ్లీ మొత్తం నామినేషన్లు ఆమోదం తిరస్కరణ ఏలూరు 10 9 1 నర్సాపురం 17 15 2 చింతలపూడి 21 11 10 తణుకు 26 18 8 తాడేపల్లిగూడెం 20 15 5 కొవ్వూరు 17 14 3 గోపాలపురం 10 7 3 నిడదవోలు 14 11 3 పాలకొల్లు 40 31 9 పోలవరం 20 17 3 భీమవరం 17 15 2 ఆచంట 18 15 3 ఉండి 15 12 3 తణుకు 18 16 2 ఉంగుటూరు 10 8 2