
అధికారులూ...నిర్లక్ష్యం వద్దు
స్పీకర్ మధుసూదనాచారి
కాచిగూడ: సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని, కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ సమీక్ష సమావేశాన్ని బుధవారం కాచిగూడలోని మహేంద్ర గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కాగితాలకే పరిమితమవుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు.
సమస్యలు పరిష్కరించకుండానే నివేదికలు అందిస్తున్నారని, ఈ విషయంలో అధికారులు మరోసారి సరి చూసుకోవాలన్నారు. పనులు చేపట్టకున్నా చేపట్టినట్లు రికార్డులు రాస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అధికారుల్లో జవాబుదారీతనం కొరవడుతోందని అసంతృప్తి వ్యక్తం చే శారు. ఐదారేళ్లుగా అనేక పనులు కొనసాగుతున్నాయని, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, జీహెచ్‌ఎంసీ సర్కిల్-9 డీఎంసీ సత్యనారాయణ, వాటర్‌వర్క్స్ డీజీఎం శ్రీధర్, నోడల్ అధికారి రాజేంద్ర కుమార్, ప్రేరణ, మాజీ కార్పొరేటర్ కన్నె ఉమారాణి, బీజేపీ గ్రేటర్ కార్యదర్శి కన్నె రమేష్‌యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎక్కాల కన్నా, బి.రవీందర్‌యాదవ్, సునిల్ బిడ్లాన్, ఎస్.మున్నాసింగ్, దూసరి శ్రీనివాస్‌గౌడ్, మేడిశెట్టి రాజేష్, తుమ్మల నర్సింహ్మారెడ్డి, యాంకర్ పవన్, లక్నపురి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.