ఏవీ.. ఆ సీట్లు..! | None of the seats .. that ..! | Sakshi
Sakshi News home page

ఏవీ.. ఆ సీట్లు..!

Published Tue, Jun 17 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

ఏవీ.. ఆ సీట్లు..!

ఏవీ.. ఆ సీట్లు..!

పేద పిల్లలకు ప్రైవేటు విద్య అందని ద్రాక్షేనా
సుప్రీంకోర్టు ఆదేశాలూ బేఖాతరు
ప్రైవేటు స్కూళ్లలో 25శాతం సీట్లు హుళక్కే
అమలు కాని విద్యాహక్కు చట్టం

 
 ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నా..అందరికీ ఇప్పుడు ‘పైవేటు’ అడుగులు తప్పడం లేదు. పేదరికంలో మగ్గుతున్న వారు సైతం తమ బిడ్డలు కాస్త డాబుగా ఉండే స్కూళ్లలో చదివితే నాలుగు అక్షరాలు నేర్చుకుంటారనే తపనతో పస్తులుండీ మరీ చదివి స్తుంటారు. ఫీజులు వారికి భారమైనా మోస్తుంటారు. దీన్ని అధిగమించేందుకు సాక్షాత్తూ ‘సుప్రీమే’ స్పందించి పేద పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో ఓ 25శాతం సీట్లను కేటాయించాలని తీర్పునిచ్చింది. దీని అమలు బాధ్యత జిల్లా విద్యాశాఖ చూడాలి. అలాంటి దాఖలాలు మచ్చుకైనా కానరాని దుస్థితి నెలకొంది. చదువులు ‘ఖరీదు’ చేసుకోలేని స్థితి ఏర్పడుతోంది.

 పాలమూరు : పేద, మధ్యతరగతి వర్గాల ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చట్టాలను రూపొందిస్తున్నప్పటికీ.. వాటి అమలు లో నెలకొన్న నిర్లక్ష్యంగా కారణంగా క్షేత్రస్థాయిలో వాటి లబ్ధి చేకూరడంలేదు. ప్రె ైవేటు విద్యా సంస్థల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లు కల్పించాలని, ఇది విద్యాహక్కు చట్టంలో భాగమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఏడాదిన్నర కావస్తున్నా నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేయడంతో పేదవర్గాలకు ఇబ్బందిగా మారింది. కొత్తగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వమైనా ఈ విషయంపై స్పందించాలని పేదకుటుంబాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. అన్ని వర్గాల వారికీ విద్యను అందించాలన్న ఉద్ధేశంతో ప్రవేశ పెట్టిన ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలు తీరు సర్కారు.. నిర్లక్ష్యం వల్ల జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని ప్రవేశపెట్టి అయిదేళ్లు పూర్తయినా అమలుకు నోచుకోవడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో పేద, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రయోజనం కలిగించే వి ధంగా ప్రత్యేకంగా సీట్లు కెటాయించాలని విద్యా హక్కు చట్టం జీఓను ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఇప్పటిదాకా జి ల్లాలో చట్టాన్ని అమలు చేయకపోవడం శోచనీయం. 2010లో ఆ జీవో విడుదల యింది. నాలుగేళ్లు పూర్తికావస్తున్నా.. ఆ విధాన్ని అమలుపర్చకపోవడంతో పేద విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది. దీనిపై ప్రతిస్పందనగా.. ప్రతి ప్రైవేటు విద్యా సంస్థలో కేజీ నుంచి పదోతరగతి వరకు 25 శాతం సీట్లను పేద పిల్లలకోసం కెటాయిం చాలని విద్యాహక్కు చట్టంలోని నిబంధన. దీనిపై గతేడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది. విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లను పేద పిల్లల కు ఉచితంగా కేటాయించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మొట్టికాయలు వేసింది. కానీ ఇది ఏడాదిన్నర కాలంగా కాగితాలకే పరిమితమైపోయిం ది. అత్యున్నత నాయ్యస్థానం ఇచ్చిన తీ ర్పును సైతం పక్కనబెట్టి ఓవైపు ప్రైవేటు విద్యా సంస్థలన్నీ ఇదివరకు తమ సీట్లన్నీ భర్తీ చేసుకున్నారు. 2014-15 విద్యా సం వత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. అం తకుముందుగానే జిల్లాలోని ప్రైవేటు వి ద్యా సంస్థలన్నీ తమ సీట్లన్నింటిని ప్రవేశ ఫీజుల తో భర్తీ చేసుకున్నాయి. ఇందులో ఏ ఒక్క పిల్లవానికి కూడా ఉచితంగా సీ టు అందించిన దాఖలాల్లేవు. దీనిపై ఏ డాది కాలంగా కేంద్ర ప్రభుత్వం నా న్చుడు ధోరణి కారణంగా.. పేద పిల్లలకు ప్రైవేటు విద్య అందని ద్రాక్షలా మారిపోయింది.

వేలాది మందికి లబ్ది

సుప్రీం తీర్పును అనుసరించి కేంద్ర ప్ర భుత్వం తక్షణమే దీనిపై మార్గదర్శకాలు జారీ చేస్తే జిల్లాల్లోనూ వేలాది మంది పేద పిల్లలకు ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. గతేడాది విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలల సం ఖ్య 850 వరకు ఉంటుంది. మరో 50 వర కు సాధారణ ప్రైవేటు పాఠశాలలు ఏర్పా టు చేశారు. అయితే వీటిల్లో 25 శాతం సీ ట్లు పేద పిల్లల కోసం కెటాయిస్తే ఎంతో మంది పిల్లలకు ప్రత్యక్షంగా లబ్దిచేకూరనుంది. ఒక్కో పాఠశాలలో కనీసం 20 మంది పేద పిల్లలను చేర్చుకున్నా.. 18000 దాటుతుంది. ఇదంతా జిల్లా స్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారులు పాఠశాల యాజమాన్యాల నిర్వహణ క మిటీ సమక్షంలో ఎంపిక చేయాల్సి ఉం టుందని గతంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికితోడు ఈ పిల్లలను ఇతర విద్యార్థులతో సమానం గా కూర్చోబెట్టడంతోపాటు అన్ని రకాల వసతుల్ని సరిసమానంగా అందించాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా నడుస్తున్న రాజీవ్ విద్యామిషన్ ద్వారా స్పష్టమైన ఆదేశాల్లో ఆచరణలోకి తీసుకొచ్చి ప్రతీ పేద పిల్లవానికి ప్రైవేటు విద్య అందేలా చూడాలని ఈ సందర్భంగా పలువురు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement