నల్లగొండ అర్బన్ : ప్రయాణికులను ఆకట్టుకోవడానికి, ఇతర వాహనాలను ఆశ్రయించకుండా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెంచుకునేం దుకు ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టిన ఆడియో సిస్టమ్ల్, ఎల్‌సీడీ టీవీల సౌకర్యం అనతికాలంలోనే అటకెక్కింది. ప్రయాణంలో వినో దం అందిస్తామని ఊదరగొట్టినా అదంతా ప్రచార ఆర్భాటంగా మిగిలిపోయింది. ప్రైవేటు ఆపరేటర్లకు దీటుగా సేవలు అందించాలని భావించిన ఆర్టీసీ యాజమాన్యం ఆ దిశగా ప్రయాణికులకు పలు పథకాలు, రాయితీలు ఇస్తే చాలదనే యోచనతో ఆధునిక, సౌకర్యవంతమైన ప్రయాణానికి బస్సుల్లో ఎల్‌సీడీ టీవీలతో వినో దం అందించే ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం నల్లగొండ రీజియన్‌లోని 16 బస్సుల్లో ఎల్‌సీడీ టీవీ లను అమర్చారు. మిర్యాలగూడ డిపోకు చెందిన 12 లగ్జరీ, నల్లగొండకు చెందిన 4 బస్సుల్లో ప్ర యోగాత్మకంగా ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల్లోనే అన్ని డిపోల్లోని మిగతా బస్సుల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కొన్నాళ్ల పాటు నడిపి వెనక్కి తగ్గారు. అదేమంటే తక్కువ దూరం ప్రయాణానికి ఇవి ఏ మాత్రం ఉపయోగకరం కావని తేల్చేశారు. ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు టీవీలకు బదులుగా ఆడియో సిస్టమ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఆ ఊసే లేకుండా పోయింది.
ఏవీ ఆడియో సేవలు...?
బస్సులు ఆదాయ మార్గంగానే కాకుండా ప్రజలకు విసుగెత్తని ప్రయాణం అందించి ఆకట్టుకోవాలని ఆరాటపడిన ఆర్టీసీ వారు బస్సుల్లో ఆడియో సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆడియో పాటలు మోగిస్తూ రయ్‌మంటూ దూసుకెళ్లే ఆటోలకు దీటుగా బస్సుల్లో ఆడియో సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు పాటలు వినిపించే అవకాశాన్ని కొన్నేళ్ల క్రితం అమల్లోకి తెచ్చినా కొద్దిరోజుల్లోనే మూగబోయింది. సీడీలు, పెన్‌డ్రైవ్‌లతో పాటలు వినిపిం చినా ఆ తర్వాత కొనసాగించడంలో విఫలం చెందారు.
ప్రైవేట్ ట్రావెల్స్‌లో...
దగ్గర, దూరం అనే తేడా లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ వారు కొన్ని బస్సుల్లో ఎల్‌సిడీ టీవీలద్వారా సినిమాలు, మరికొన్ని బస్సుల్లో ఆడియో సిస్టమ్‌ల ద్వారా పాటలు వినిపిస్తూ ప్రయాణికుల్ని ఆకర్శిస్తుండగా ఆర్టీసీ వారు మాత్రం పాతపోకడలనే అవలంభిస్తున్నారు. పెరిగిన సాంకేతికను వినియోగించుకునే పరిస్థితుల్లో లేరు. బస్సుల్లో ఎల్‌సీడీ టీవీల ఏర్పాటు చేస్తె వినోద కార్యక్రమాలతో పాటు, ప్రయాణి సమాచారం, ప్రకటనలతో ఆదాయం కూడా పెరిగే అవకాశాలుం టాయి. కానీ నిర్వహణ లోపాలతో కుంటిసాకులు చెబుతూ మసకబార్చారు. ప్రైవేటు రంగంలో ట్రావెల్స్ బస్సుల్లో అమలు చేయగలిగే సౌకర్యాలను దేశంలోనే అతిపెద్ద ప్రజారంజకమైన ప్రభుత్వరంగ సంస్థగా పేరొందిన ఆర్టీసీ వారు మాత్రం తీర్చలేకపోతున్నారు.
వినోదం ముణ్నాళ్ల ముచ్చటేనా..?
Published Tue, Nov 18 2014 3:16 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement