జడ్చర్ల, న్యూస్‌లైన్:1962లో జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు ఐదుసార్లు బీసీ, ఐదుసార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. ఎనిమిది మండలాల పరిధిలోని గ్రామాలతో అటుఇటుగా ఉన్న ఈ నియోజకవర్గం పాలనాపరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. చివరికి 2009లో జరిగిన పునర్విభజనలో జడ్చర్ల, బాలానగర్, మిడ్జిల్, నవాబ్‌పేట మండలాలతో ఓ రూపు దాల్చింది.
నియోజకవర్గంలో దాదాపు 2.50లక్షల జనాభా ఉండగా, 1.89లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో సుమారు 37,636 మంది ఓటర్లు బీసీ సామాజికవర్గానికి చెందిన ముదిరాజ్‌లు జనాభాలో మొదటిస్థానంలో ఉన్నారు. వీరి తరువాత 29,818 మంది ఎస్సీ సామాజికవర్గం రెండోస్థానంలో ఉంది. వీరి తరువాత యాదవ కులస్తులు 24,847మంది, ఎస్టీలకు సంబంధించి లంబాడ సామాజికవర్గానికి చెందిన 24,061 మంది ఓటర్లు ఉన్నారు.
1972,78లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ సామాజికవర్గానికి చెందిన నర్సప్ప రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1994లో టీడీపీ అభ్యర్థి ఎర్ర సత్యనారాయణ(ఎర్ర సత్యం)ను గెలిపించారు. ఆయన మరణాంతరం సోదరుడు ఎర్ర శేఖర్‌ను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆదరించారు.
1967లో భూత్పూర్ మండలం పోల్కంపల్లికి చెందిన లక్ష్మినర్సింహారెడ్డిని ఎమ్మెల్యేగా ఆదరించారు. అనంతరం జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన ఎం.కృష్ణారెడ్డి ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి టీడీపీ నుంచి విజయం సాధించారు. వీరి తరువాత తాడూరు మండలం సిరసవాడ గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2004లో తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన సి.లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు రవి ఒక సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
రెండు సార్లు ఓకే మూడోసారి డౌటే
Published Sun, Apr 6 2014 3:29 AM | Last Updated on Tue, Aug 14 2018 4:51 PM
Advertisement