అయ్యో.. | Oops .. | Sakshi
Sakshi News home page

అయ్యో..

Published Mon, Feb 9 2015 2:56 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

Oops ..

ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంపై బెంగపట్టుకుంది. జిల్లాలో సుమారు ఏడు వేలకు పైగా దరఖాస్తులు పేరుకుపోగా.... ఐదు నెలలుగా లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికీ ప్రోత్సాహకాలు అందలేదు. ఫలితంగా ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నారుు. ప్రస్తుత టీఆర్‌ఎస్ సర్కారు ఆ పథకాన్ని కొనసాగిస్తుందా.. లేదా... అనే సందేహం వ్యక్తమవుతోంది.  

 
 ములుగు : జిల్లాలో చేపట్టిన ట్రాన్స్‌లొకేషన్ ట్రీస్ ప్రయోగం విఫలమైంది. గుజరాత్, అహ్మదాబాద్, మహారాష్ట్రలో పాటించిన ట్రాన్స్‌లొకేషన్ పద్ధతి సత్ఫలితాలను ఇచ్చిందనే సమాచారంతో అప్పటి ఉమ్మడి రాష్ర్టంలో జిల్లా కలెక్టర్ గంగాధర కిషన్ ఒక చోట బతికి ఉన్న చెట్టును అమాంతం భూమి నుంచి తొలగించి వేరే చోట నాటేం దుకు శ్రీకారం చుట్టారు. చెట్లను తొలగించకుం డా స్థానచలనం చేయాలని  సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గ త మేడారం మహా జాతర ముందు వరంగల్ నుం చి భూపాలపట్నం వెళ్లే రహదారి 163 విస్తరణ సమయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు ములుగు మండలం పందికుంట క్రాస్ రోడ్ దగ్గరలోని రహదారి పక్కనున్న సుమారు 15 చెట్లను  ట్రా న్స్‌లొకేషన్ పద్ధతిన పెకలించి మే డారం సమీపంలోని నార్లాపూర్, చింతల్ క్రాస్ ప్రాంతంలో నాటారు.  
 
 ప్రయోగం విజయవంతమైతే రాష్ర్టం లో వివిధ ప్రాంతాల్లోని విలువై న చెట్లను కాపాడుకునే వీలుంటుందని వినూ త్న ప్రయత్నానికి నాంది పలికారు. ప్రస్తుత నగరీకరణ వ్యవస్థలో భాగంగా నాశనం అవుతున్న పురాతన వృక్షాలు,  విలువైన చెట్లను కా పాడుకోవచ్చని కలెక్టర్ ప్రణాళిక వేశారు.  సా యి జ్యోతి నర్సరీ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ వి జేందర్‌రెడ్డి పనులను చేపట్టారు.  రూట్ హా ర్మోన్ బూస్టింగ్ కెమికల్‌తోపాటు వర్మీ కంపో స్టు ఎరువును పోసి ఉంచి 25 నుండి 40 రోజు ల తర్వాత క్రేన్ సహాయంతో అడుగు భాగంలో ఉన్న చిన్న చిన్న వేర్లతో చెట్ల ను భూమి నుంచి తొలగించారు. వీటిని  చింతల్‌క్రాస్ వ ద్ద గోతులు తీసి...వివిధ రకాల ఎరువులు వేసి నాటారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చనీం శనీయంగా మారింది. సరిగ్గా సంవత్స రం గడిచేసరికి సీన్ రివర్స్ అయింది. నాటిన 15 చె ట్లలో 13 చనిపోయాయి. కేవలం రెండు చెట్ల కు మాత్రమే  చిగుర్లు ఉన్నాయి.
 
  చెట్ల వేర్లు అం టుకుని కొమ్మలకు ఆకులు వచ్చేదాకా పర్యవేక్షిం చాల్సిన అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడం మూలంగానే చెట్లు చనిపోయాయని  వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతి 15 రోజులకు పరిశీలించి చెట్ల చుట్టు పాదులు ఏ ర్పాటు చేసి నీటిని అందించి ఉంటే ప్రయోగం ఫలితాన్నిచ్చేదని అంటున్నారు. దీంతో రూ.లక్షలు ఖర్చుపెట్టి చేపట్టిన వినూత్న ప్ర యోగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫలితాన్నివ్వకుండా పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు.
 
 పట్టించుకోకపోవడంతోనే...
 పెరుగున్న వసతులు, అవసరాలకు అనుగుణంగా పర్యావరణానికి మేలు చేసే చెట్లను తొలగిస్తే పెనుముప్పుకు దారితీస్తుంది. దీన్ని నివారించేందుకు ప్రస్తుతం ఉన్న చెట్లను తొలగించి మరో చోట నాటే పద్ధతికి శాస్త్రవేత్తలు నాంది పలికారు. 2009లో గుజరాత్, మహారాష్ట్ర  ప్రాంతాల్లో చేసిన ప్రయోగంలో సుమారు 90 శాతం చెట్లు బతికాయి. మన దగ్గర ఆ నిష్పత్తి 10 శాతం కూడా లేకపోవడం బాధాకరం . సంభందిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెట్లు చనిపోయి ఉంటాయి. ఆస్ట్రేలియా  వంటి దేశాల్లో హైడ్రాలిక్ ప్రెజర్ వంటి యంత్రాలతో శాస్త్రీయ పరమైన జాగ్రత్తలు తీసుకుంటూ చెట్లను మార్చిడి చేస్తున్నారు. ప్రయోగం విజయవంతమైతే పెద్దపెద్ద వృక్షాలు, విలువైన చెట్లను కాపాడుకునే వీలుంటుంది.
 - డాక్టర్ సుతారి సతీష్, కేయూ వృక్షశాస్త్ర అధ్యాపకుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement