Trans location
-
సచివాలయం చెట్లు బతికి బట్టకట్టేనా!
సాక్షి, హైదరాబాద్: పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రపంచమంతటా అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఏదైనా అభివృద్ధి పనుల కోసం చెట్లను తొలగించాల్సి వస్తే... నిర్దయగా నరికివేయడం లేదు. దశాబ్దాలుగా పెరిగిన చెట్లను శాస్త్రీయ పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా పెకిలించి... మరోచోటికి తరలించి ప్రాణప్రతిష్ట చేస్తున్నారు. కానీ తెలంగాణ కొత్త సచివాలయం నిర్మిస్తున్న ప్రాంతంలో ఉన్న చెట్లు మాత్రం ప్రమాదంలో పడ్డాయి. ప్రస్తుతం సచివాలయ నిర్మాణానికి పునాదులు తవ్వే పని మొదలైంది. కాస్త ముందుచూపుతో ఇక్కడున్న చెట్లను ఈపాటికే మరో ప్రాంతానికి ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో తరలించి ఉంటే బతికేవి. కానీ ప్రస్తుతం పొడి వాతావరణం ఏర్పడటంతో ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో చెట్లకు ప్రాణదానం చేసే అవకాశాలు బాగా సన్నగిల్లాయి. రెండు వానాకాలాలు పోయాయి... కొత్త సచివాలయ భవన నిర్మాణానికి వీలుగా అక్కడి కార్యాలయాలను దాదాపు ఏడాదిన్నర క్రితమే బీఆర్కేఆర్ భవన్‌తో పాటు ఇతర భవనాల్లోకి తరలించారు. 2019 ఆగస్టు నుంచి సచివాలయ ప్రాంగణం ఖాళీగా ఉంది. గత జూలైలో పాత భవనాల కూల్చివేత మొదలైంది. అంటే.. మధ్యలో రెండు వానాకాలాలు వెళ్లిపోయాయి. ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో చెట్లను మరో చోటకు తరలించి బతికించుకునేందుకు జూన్ నుంచి నవంబర్ వరకు సానుకూల వాతావరణం ఉంటుంది. డిసెంబర్ నుంచి వాతావరణంలో తేమ శాతం తగ్గి పొడి పరిస్థితులు ఏర్పడటంతో చెట్లు బతికే అవకాశాలు సన్నగిల్లుతాయి. అదను దాటిపోయాక ప్రస్తుతం సచివాలయంలో చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు వీలుగా అధికారులు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అంటే ప్రక్రియ మొదలయ్యేందుకు ఎంత లేదన్నా మరో పక్షం రోజులకు పైగా సమయం పడుతుందన్న మాట. అప్పుడు ట్రాన్స్‌లొకేట్ చేసే చెట్లలో 30 శాతమే బతికే అవకాశం ఉంటుంది. స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చినా.. వాటా ఫౌండేషన్ అనే సంస్థ చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు ముందుకొచ్చింది. గత నెలలో దాదాపు 18 చెట్లను శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు స్థలానికి తరలించి తిరిగి నాటింది. ఆ తర్వాత ఆ సంస్థ ఈ ప్రక్రియ నుంచి తప్పుకుంది. సచివాలయ ప్రాంగణంలో దాదాపు 600కు పైగా చెట్లు ఉంటే, సరిగ్గా కొత్తభవనం నిర్మించే ప్రాంతంలో 90 వరకు ఉన్నాయి. ఈ 90 చెట్లను తొలగించాల్సిందే. ఇందులో 33 చెట్ల ట్రాన్స్లొకేçషన్‌కు అటవీశాఖ అనుమతించింది. మిగతావి కొట్టేయచ్చన్న మాట. కొట్టేసే చెట్లను కూడా ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు స్వచ్ఛంద సంస్థ ఆసక్తి చూపగా, ఆ విషయంలో అధికారులకు– ఆ సంస్థకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. తర్వాత ఆ సంస్థ ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియ నుంచి తప్పుకొన్నట్టు తెలిసింది. తరలించాలంటే సమయం అవసరం ఇలా ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలో 60 ఏళ్లకు పైబడ్డ చెట్లు కూడా ఉన్నాయి. తొలగించాల్సిన ప్రాంతంలో దాదాపు 50కి పైగా పెద్ద చెట్లు ట్రాన్స్‌లొకేషన్ ద్వారా మరోచోట కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంది. సాధారణంగా పెద్ద చెట్టును ట్రాన్స్‌లొకేట్ ప్రక్రియ ప్రారంభానికి ముందు కనీసం 21 రోజుల సమయం అవసరమవుతుంది. కొమ్మలు, పెద్ద వేర్లు తొలగించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో చిగుళ్లు, కొత్త పిల్ల వేర్లు రావాల్సి ఉంటుంది. అప్పుడు తరలిస్తేనే ఆ చెట్టు ఏనుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు టెండర్లు పిలిచి కొత్త సంస్థను ఎంపిక చేశాక.. మళ్లీ 21 రోజుల సమయం అవసరమవుతుంది. అప్పటికి వాతావరణంలో పొడి పరిస్థితులు పెరిగి వాటిని బతికించటం మృగ్యమవుతుంది. -
‘పచ్చ’దనంపై మహా చొరవ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చేపడుతున్న అభివృద్ధి పనుల్లో పచ్చదనానికి విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బాలానగర్‌లోని శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం సేకరించిన స్థలంలో 95 చెట్లను హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు గుర్తించారు. అయితే పచ్చదనానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో 15 భారీ చెట్లను ట్రాన్స్‌లోకేషన్ (ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం) చేయాలని, మరో 34 చెట్లను నరికివేయాలని, మిగిలిన 46 చెట్లను యథాతథంగానే కొనసాగించాలని గతంలోనే నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం 15 చెట్లను ప్రణాళికాబద్ధంగా చుట్టూరా గుంతలు తీసి జేసీబీల సహాయంతో వేళ్లతో సహా భారీ వాహనాల్లో ఎక్కించి గండిమైసమ్మలోని హెచ్ఎండీఏ నర్సరీకి తరలించి మళ్లీ పెట్టారు. ట్రాన్స్‌లొకేషన్ ద్వారా తొలగించిన చెట్లను తొలుత సమీపంలోని ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి తరలించాలని భావించినా అక్కడ ఉన్న వస్తువు నిల్వల వల్ల హెచ్ఎండీఏ నర్సరీకి తీసుకెళ్లినట్లు హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ట్రాన్స్‌లొకేషన్ పనులను వేగవంతం చేశామని, 15 చెట్లను తరలించాలని తొలుత భావించినా, మరో రెండు చెట్లను కూడా తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత వరకు చెట్లను ట్రాన్స్‌లొకేషన్ చేసి కాపాడుతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చెట్లను కొట్టివేయాల్సి వస్తోందన్నారు. ‘ బాలానగర్ ఫ్లైవర్కు అడ్డంకిగా ఉన్న 95 చెట్లలో 46 చెట్లను యథావిధిగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ట్రాన్స్‌లొకేషన్ చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చుట్టూ గుంతలు తవ్వినా చెట్ల వేళ్లు ఎక్కువగా తారుతో కప్పబడి ఉన్నాయి. కొన్ని చెట్లు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ తీగలు, వాటర్ పైపులు, టెలికామ్ కేబుల్స్ ఉండటంతో వీటన్నిటింటిని జాగ్రత్తగా గమనిస్తూ చెట్లను ట్రాన్స్‌లొకేషన్ చేస్తున్నాం. వేరే ప్రాంతానికి తీసుకెళ్లిన ఈ చెట్టుకు నీళ్లుపోయడం, నిర్వహణ కూడా సమస్యగా మారింద’ని తెలిపారు. అటవీ శాఖ అధికారులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులతో కూడిన చెట్ల పరిరక్షణ కమిటీ ఆమోదముద్ర వేసిన తర్వాతే ట్రాన్స్‌లొకేషన్ పనులు చేపట్టామని హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు. అయితే అన్ని చెట్లు ట్రాన్స్‌లోకేషన్ చేద్దామనుకున్నా వాటి జీవితకాలం తక్కువగా ఉండటంతో కూల్చివేయాలని నిర్ణయించామని, చెట్ల పరిరక్షణ కమిటీ ఆమోదంతోనే ఇందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా బాలానగర్‌లోని శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కిలోమీటర్ల పొడవునా ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం ఎనిమిది ఎకరాల 20 గుంటలు (33,175 చదరపు మీటర్ల) స్థలంలో 357 ప్రాపర్టీలకు నష్టం కలుగుతోంది. ఈ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.104.53 కోట్లు కాగా, భూసేకరణ కోసం రూ.265 కోట్లను హెచ్ఎండీఏ చెల్లిస్తోంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల టెండర్‌ను దక్కించుకున్న బీఎస్సీపీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పనులు చేపట్టింది. -
అయ్యో..
ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంపై బెంగపట్టుకుంది. జిల్లాలో సుమారు ఏడు వేలకు పైగా దరఖాస్తులు పేరుకుపోగా.... ఐదు నెలలుగా లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికీ ప్రోత్సాహకాలు అందలేదు. ఫలితంగా ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నారుు. ప్రస్తుత టీఆర్ఎస్ సర్కారు ఆ పథకాన్ని కొనసాగిస్తుందా.. లేదా... అనే సందేహం వ్యక్తమవుతోంది. ములుగు : జిల్లాలో చేపట్టిన ట్రాన్స్‌లొకేషన్ ట్రీస్ ప్రయోగం విఫలమైంది. గుజరాత్, అహ్మదాబాద్, మహారాష్ట్రలో పాటించిన ట్రాన్స్‌లొకేషన్ పద్ధతి సత్ఫలితాలను ఇచ్చిందనే సమాచారంతో అప్పటి ఉమ్మడి రాష్ర్టంలో జిల్లా కలెక్టర్ గంగాధర కిషన్ ఒక చోట బతికి ఉన్న చెట్టును అమాంతం భూమి నుంచి తొలగించి వేరే చోట నాటేం దుకు శ్రీకారం చుట్టారు. చెట్లను తొలగించకుం డా స్థానచలనం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గ త మేడారం మహా జాతర ముందు వరంగల్ నుం చి భూపాలపట్నం వెళ్లే రహదారి 163 విస్తరణ సమయంలో ఆర్అండ్బీ అధికారులు ములుగు మండలం పందికుంట క్రాస్ రోడ్ దగ్గరలోని రహదారి పక్కనున్న సుమారు 15 చెట్లను ట్రా న్స్లొకేషన్ పద్ధతిన పెకలించి మే డారం సమీపంలోని నార్లాపూర్, చింతల్ క్రాస్ ప్రాంతంలో నాటారు. ప్రయోగం విజయవంతమైతే రాష్ర్టం లో వివిధ ప్రాంతాల్లోని విలువై న చెట్లను కాపాడుకునే వీలుంటుందని వినూ త్న ప్రయత్నానికి నాంది పలికారు. ప్రస్తుత నగరీకరణ వ్యవస్థలో భాగంగా నాశనం అవుతున్న పురాతన వృక్షాలు, విలువైన చెట్లను కా పాడుకోవచ్చని కలెక్టర్ ప్రణాళిక వేశారు. సా యి జ్యోతి నర్సరీ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ వి జేందర్‌రెడ్డి పనులను చేపట్టారు. రూట్ హా ర్మోన్ బూస్టింగ్ కెమికల్తోపాటు వర్మీ కంపో స్టు ఎరువును పోసి ఉంచి 25 నుండి 40 రోజు ల తర్వాత క్రేన్ సహాయంతో అడుగు భాగంలో ఉన్న చిన్న చిన్న వేర్లతో చెట్ల ను భూమి నుంచి తొలగించారు. వీటిని చింతల్‌క్రాస్ వ ద్ద గోతులు తీసి...వివిధ రకాల ఎరువులు వేసి నాటారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చనీం శనీయంగా మారింది. సరిగ్గా సంవత్స రం గడిచేసరికి సీన్ రివర్స్ అయింది. నాటిన 15 చె ట్లలో 13 చనిపోయాయి. కేవలం రెండు చెట్ల కు మాత్రమే చిగుర్లు ఉన్నాయి. చెట్ల వేర్లు అం టుకుని కొమ్మలకు ఆకులు వచ్చేదాకా పర్యవేక్షిం చాల్సిన అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడం మూలంగానే చెట్లు చనిపోయాయని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతి 15 రోజులకు పరిశీలించి చెట్ల చుట్టు పాదులు ఏ ర్పాటు చేసి నీటిని అందించి ఉంటే ప్రయోగం ఫలితాన్నిచ్చేదని అంటున్నారు. దీంతో రూ.లక్షలు ఖర్చుపెట్టి చేపట్టిన వినూత్న ప్ర యోగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫలితాన్నివ్వకుండా పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. పట్టించుకోకపోవడంతోనే... పెరుగున్న వసతులు, అవసరాలకు అనుగుణంగా పర్యావరణానికి మేలు చేసే చెట్లను తొలగిస్తే పెనుముప్పుకు దారితీస్తుంది. దీన్ని నివారించేందుకు ప్రస్తుతం ఉన్న చెట్లను తొలగించి మరో చోట నాటే పద్ధతికి శాస్త్రవేత్తలు నాంది పలికారు. 2009లో గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో చేసిన ప్రయోగంలో సుమారు 90 శాతం చెట్లు బతికాయి. మన దగ్గర ఆ నిష్పత్తి 10 శాతం కూడా లేకపోవడం బాధాకరం . సంభందిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెట్లు చనిపోయి ఉంటాయి. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో హైడ్రాలిక్ ప్రెజర్ వంటి యంత్రాలతో శాస్త్రీయ పరమైన జాగ్రత్తలు తీసుకుంటూ చెట్లను మార్చిడి చేస్తున్నారు. ప్రయోగం విజయవంతమైతే పెద్దపెద్ద వృక్షాలు, విలువైన చెట్లను కాపాడుకునే వీలుంటుంది. - డాక్టర్ సుతారి సతీష్, కేయూ వృక్షశాస్త్ర అధ్యాపకుడు