
జగదేవ్‌పూర్ (గజ్వేల్): ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో 35 మంది అవయవదానానికి ముందుకొచ్చారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ భాగ్యభిక్షపతి ఆధ్వర్యంలో మొత్తం 35 మంది యువకులు, మహిళలు కలిసి అవయవదానాలు చేస్తామని గాంధీ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ఎర్రవల్లిని బంగారువల్లిగా మార్చారని, అందుకు కృతజ్ఞతగా తాము అవయవదానం చేసేందుకు ముందుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాగ్య, వీడీసీ సభ్యులు బాల్‌రాజు, కరుణాకర్‌రెడ్డి, నవీన్, శ్రీశైలం, దాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment