కాచిగూడ (హైదరాబాద్) : 'ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న జరిగే బీఫ్ పెస్టివల్‌ను అడ్డుకుందాం, గోమాతను రక్షించుకుందాం' అంటూ శివసేన తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం కాచిగూడలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎ.సుదర్శన్ ఆవిష్కరించారు.
హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క హిందువూ 10న జరిగే బీఫ్ పెస్టివల్‌ను అడ్డుకునేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివసేన ప్రతినిధులు ఎ.నర్సింగ్‌రావు, భారతీయ విద్యార్థి సేన గ్రేటర్ అధ్యక్షులు ఎస్.గంగాధర్, ఎ.సందీప్, ఎ.తిరుమలేష్, ఎం.నరేష్, రాహుల్, సాయికిషోర్, వంశి, శివ తదితరులు పాల్గొన్నారు.
బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకుందాం రండి: శివసేన
Published Tue, Dec 8 2015 7:36 PM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM
Advertisement
Advertisement