మాజీ మంత్రి పార్టీ వీడరు: డీసీసీ అధ్యక్షుడు | P. Sudarshan Reddy not quit Congress | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి పార్టీ వీడరు: డీసీసీ అధ్యక్షుడు

Published Mon, Aug 4 2014 11:53 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

P. Sudarshan Reddy not quit Congress

నిజామాబాద్: మాజీ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తెలిపారు. మాజీ మంత్రి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారంటూ వారం రోజులుగా వస్తున్న కథనాలను తాహెర్ ఖండించారు.

సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరు నాయకులు ఆయన పార్టీని వీడుతున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఆదివారం సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు హైదరాబాద్‌కు వెళ్లినపుడు, తాను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్లటం లేదని ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement