taher bin hamdan
-
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ రాజకీయ చరిత్ర
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన గణేష్ బిగాల మరోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి తాహిర్ బిన్ హమదాన్పై 26055 ఓట్ల ఆదిక్యత సాదించారు. గణేష్ గుప్తాకు 71397 ఓట్లు రాగా, తాహిర్ బిన్ కు 45342 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే ఇ.లక్ష్మీనారాయణకు సుమారు ఇరవై మూడువేల ఓట్లు వచ్చాయి. లక్ష్మినారాయణ 2009 ఎన్నికలలో గెలిచిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో బాగంగా ఆయన తన పదవికి రాజీనామా చేసి, తిరిగి ఉప ఎన్నికలో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికలో అప్పటి పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను ఆయన ఓడిరచారు. కాని తదుపరి జరిగిన ఎన్నికలలో లక్ష్మినారాయణ గెలవలేక పోయారు. గణేష్ బిగాల వైశ్య సామాజికవర్గానికి చెందిన వారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ సామాజికవర్గం నుంచి ఈయన ఒక్కరే గెలిచారు. ఈ నియోజక వర్గంలో మున్నూరుకాపు వర్గం నేతలు ఎక్కువగా గెలిచినా, ఇతర సామాజిక వర్గాల వారికి కూడా అవకాశం రావడం విశేషం.11 మంది బిసి నేతలు ప్రదానంగా మున్నూరు కాపు సామాజికవర్గం వారు ఎన్నికవుతూ వచ్చారు.రెండుసార్లు ముస్లింలు, రెండుసార్లు వైశ్య, ఒకసారి ఇతరులు కూడా ఎన్నికయ్యారు. సీనియర్ నేత డి.శ్రీనివాస్ 1989, 1999, 2004లలో ఇక్కడ నుంచి మూడుసార్లు గెలుపొందారు. ఈయన 1989-94 మధ్యకాలంలో, అలాగే 2004లో వై.ఎస్.మంత్రివర్గంలోను సభ్యునిగా ఉన్నారు. రెండుసార్లు పిసిసి అద్యక్షుడు అయ్యారు. శాసనమండలిలో కాంగ్రెస్ ఐ పక్షాన ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. కాని ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. తదుపరి రాజ్యసభకు టిఆర్ఎస్ పక్షాన ఎన్నికయ్యారు. కాని కొంతకాలానికి టిఆర్ఎస్ లో అసమ్మతి నేతగా మారారు. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బిజెపిలో చేరి నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ముఖ్యమంత్రి కెసీఆర్ కుమార్తె కవితను ఓడిరచి సంచలనం సృష్టించారు. నిజామాబాదులో 16సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు కలిసి ఆరుసార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి రెండుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు గెలవగా, ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ నుంచి గెలుపొంద గలిగారు. టిడిపి పక్షాన డి. సత్యనారాయణ రెండుసార్లు, కాంగ్రెస్ నేత డి.హుస్సేన్ రెండుసార్లు గెలిచారు. డి. సత్యనారాయణ ఎన్.టి.ఆర్. క్యాబినెట్లో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బంగారు కాదు.. బాధల తెలంగాణ
రెంజల్ : టీఆర్ఎస్కు అధికారం అందిస్తే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరు నెలల కాలంలో బాధల తెలంగాణగా మార్చారని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ విమర్శించారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. ప్రస్తుత సీజన్లో ఎన్ని గంటల త్రీఫేస్ విద్యుత్‌ను రైతులకు అందిస్తారో ప్రకటించడంలేదన్నారు. జిల్లాలో 48 శాతం పింఛన్లకు కోతల వాతలు పెట్టారని ఆరోపించారు. పింఛన్ల బెంగతో వృద్ధులు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చలనంలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ఆత్మహత్యల పాపం టీఆర్ఎస్దేనన్నారు. కనీసం ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన హామీలను సైతం ప్రభుత్వం నెరవేర్చడంలేదన్నారు. 25 శాతం రైతు రుణమాఫీ ఖాతాల్లో చేరుతున్నాయని చేస్తున్న ప్రకటన నిరాధారమవుతోందన్నారు. సభ్యత్వ నమోదుకు స్పందన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. జిల్లాలో ఈ నెల 9వ తేదీ వరకు లక్షా 30 వేల సభ్యత్వం లక్షంగా నిర్ణయించామన్నారు. సమావేశంలో ఎంపీపీ మోబిన్‌ఖాన్, జడ్పీటీసీ సభ్యుడు నాగభూషణంరెడ్డి, సర్పంచ్ జావీదోద్దిన్, వక్ఫ్ బోర్డు జిల్లా డెరైక్టర్ హాజీఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను మోసం చేస్తున్న కేసీఆర్
డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ నిజామాబాద్ క్రైం : రుణమాఫీ విషయంలో రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ విమర్శించారు. బ్యాంకులో రుణాలను 25 శాతం చెల్లిస్తే తిరిగి రీషెడ్యూల్ ఎలా చేస్తారని ప్రశ్నిం చారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామంటూ వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు రైతులను మోసగిస్తున్నారని విమర్శించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం 25 శాతం రుణాలు చెల్లించేందుకు రూ.4,250 కోట్లు బ్యాంకులకు చెల్లించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ రైతులు తీసుకున్న మొత్తం రుణం సెప్టెంబర్ 30 వరకు చెల్లిస్తేనే బ్యాంకులు తిరిగి రుణాలు ఇచ్చేందుకు రీ షెడ్యూల్ చేసేందుకు ముందుకువస్తాయన్నారు. అలా కాకుండా మొత్తం రుణంలో 25 శాతం రుణం మాత్రం చెల్లిస్తే ఏ బ్యాంకులు కూడా దీనిని ఒప్పుకోవన్నారు. మిగతా 75 శాతం రుణంపై బ్యాంకులు వడ్డీ విధిస్తాయన్నారు. రుణమాఫీ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ రిజర్వు బ్యాంక్ అధికారులతో మాట్లాడితే రైతుల రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. రుణ మాఫీ లేకుండా పోవడం, రుణాలు రీ షెడ్యూల్ చేసేందుకు అవకాశం కోల్పోతుండటంతో రైతు కుటుంబాలు పండుగలు ఎలా చేసుకుంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి దసరా పండుగకు దూరంగా ఉండే పరిస్థితులు దాపురించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీసం పండుగల పూట అయినా విద్యుత్ కోత లేకుండా ఇచ్చామన్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం పండుగల పూట కూడా విద్యుత్ కోతలు విధిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. -
మాజీ మంత్రి పార్టీ వీడరు: డీసీసీ అధ్యక్షుడు
నిజామాబాద్: మాజీ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తెలిపారు. మాజీ మంత్రి టీఆర్ఎస్లో చేరుతున్నారంటూ వారం రోజులుగా వస్తున్న కథనాలను తాహెర్ ఖండించారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరు నాయకులు ఆయన పార్టీని వీడుతున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఆదివారం సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు హైదరాబాద్‌కు వెళ్లినపుడు, తాను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్లటం లేదని ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నారు. -
మీరు మారితేనే మీ వెంట
నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన డీసీసీ కార్యవర్గ సమావేశం వాడివేడిగా సా గింది. పలువురు నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను ఆగ్రహావేశాలతో వ్యక్తం చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సత్సంబంధాలను కలిగి ఉన్న నేతలు జిల్లాలో ఉన్నప్పటికీ, గత ఎన్నికలలో పార్టీ తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డి.శ్రీనివాస్, రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేసిన షబ్బీర్‌అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్‌తోపాటు తలపండిన నాయకులు ఉన్నా, రానున్న ఎన్నికల లో విజయావకాశాలపై సందిగ్ధత, అనుమానాలు నెలకొనడం విచారకరమన్నారు. ఇప్పటికైనా నేతలు గత అనుభవాలు, తప్పిదాల నుంచి గుణపాఠం నే ర్చుకుని విభేదాలు, గ్రూపులకు స్వస్తి పలకాలన్నారు. సమష్టి నాయకత్వంతో ముందుకు సాగితేనే రానున్న ఎన్నికలలో వారి వెంట ఉంటామని, లేనిపక్షంలో తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ...జిల్లాకు చెందిన అగ్రనాయకత్వాన్ని ఆహ్వానించకుండానే డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హుందాన్ సమావేశా న్ని నిర్వహించారు. సమావేశంలో బ్లాక్, మండల పార్టీ అధ్యక్షులు, ద్వితీయ శ్రేణి నాయకులు, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సుమారు 300 మందికి పైగా నేతలు పాల్గొన్నారు. అగ్రనాయకులు లేకపోవడంతో కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించారు. నేతలపై ఉన్న వ్యతిరేక తను పరోక్షంగా సూచించారు. తాము అనుసరించే అగ్రనాయకుడికి వత్తాసు పలికే విధంగా మరి కొంత మంది మాట్లాడేందుకు ప్రయత్నించారు. మొత్తం మీద జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు, గ్రూపులు తీవ్రంగా ఉన్నాయన్న విషయం సమావేశంలో బహిర్గతమైంది. వాస్తవంగా జిల్లా పార్టీలో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి. మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒక గ్రూపుగా, డీఎస్ మరో గ్రూపుగా వ్యవహరిస్తున్నారు. ఎంపీలు మధుయాష్కీ, సురేశ్‌షెట్కార్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, విప్ అనిల్ తదితరులు తటస్థంగా ఉంటున్నప్పటికీ వీరిలో కొంత మందికి సయోధ్యలేదు. ఈ నేపథ్యంలోనే జిల్లా కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన 30 మంది నాయకులు, కార్యకర్తలలో 16 మందికిపైగా పార్టీలోని గ్రూపు విభేదాలు, సమన్వయ లోపంపైనే ప్రధానంగా ప్రస్తావించారు. నాయకత్వం ఐక్యతతో, సమన్వయంతో కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో ముందుకుసాగినప్పుడే పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ విషయాన్ని సమావేశంలో చర్చంచడం ద్వారా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి జిల్లా అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లాలని కొంత మంది సూచిం చడం గమనార్హం. పొత్తులు వద్దు అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసి మాటను నిలబెట్టుకున్న ఈ తరుణంలో రానున్న ఎన్నికలలో టీఆర్ఎస్తో పొత్తు అవసరం లేదని, మనం బలంగానే ఉన్నామని పలువురు పేర్కొన్నారు. గతంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై, కార్యకర్తలపై దాడి చేసినప్పటికీ ఎదుర్కొని నిలబడ్డామన్నారు. అవకాశవాదులు, పదవులను ఆశించే నాయకులే పొత్తులను ఆశిస్తున్నారని, పొత్తు కోసం పాకులాడవద్దని ద్వితీయ శ్రేణి నాయకులు స్పష్టం చేశారు. అధిష్టానవర్గం ఆదే శిస్తేనే పొత్తుల గురించి ఆలోచించాలి తప్పితే, తమకు తాముగా ప్రస్తావన తేవద్దని కోరారు. ప్రెషర్ గ్రూపుగా డీసీసీ అధ్యక్షుడిగా ఆరుమాసాల కిందట బాధ్యతలు చేపట్టిన తాహెర్ బిన్ హుందాన్ తనదైన శైలిలో జిల్లా కాంగ్రెస్ సమావేశం నిర్వహణకు శ్రీకారం చుట్టారు. జిల్లా కు చెందిన అగ్రనేతలు డి.శ్రీనివాస్, షబ్బీర్‌అలీ, కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు మధుయాష్కీగౌడ్, సురేశ్‌షెట్కార్, మంత్రి సుదర్శన్‌రెడ్డి, విప్ అని ల్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు పలువురు నేతలను ఆహ్వానించకుండానే కాంగ్రెస్ సమావేశాన్ని కొనసాగించారు. అసెంబ్లీ, శాసనమండలి సభలు జరుగుతుండడం వల్లనే జిల్లా నాయకులను సమావేశానికి ఆహ్వానించలేదని తాహెర్‌బిన్‌హందాన్ చెబుతున్నప్పటికీ ఇందులో మరో కారణం దాగి ఉందన్న అభిప్రాయాలను మరి కొంత మంది కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డి అనుచరుడిగా ముద్ర పడిన తాహెర్‌బిన్ కార్యవర్గ సమావేశానికి ఎవరిని ఆహ్వానించినా కష్టాలు తప్పవనే భావనతోనే పిలువకపోవచ్చునన్న చర్చ సాగుతోంది. జిల్లాలో జరుగుతున్న ప్రధాన కార్యక్రమాలకు మంత్రినే ఆహ్వానించడం, ఆయన కార్యక్రమాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించడం, డీఎస్ వంటి నేతలతో పాటు జిల్లాలో కొనసాగుతున్న కార్యక్రమా ల కు తాహెర్‌బిన్ దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ప్రెషర్ గ్రూపుగా బలపడేందుకు ఇలాం టి వ్యూహంతో ముందుకుసాగుతున్నారే మోనని అంటున్నారు. ఇప్పటికే జిల్లా నాయకత్వంలో నెలకొన్న గ్రూపులు, విభేదాలతోనే ఇబ్బందిపడుతున్న పలువురు ఇదేమి కొత్త వివాదమని అంటున్నారు. -
సిద్ధం కండి
నిజామాబాద్‌సిటీ,న్యూస్‌లైన్: ‘‘మూడు నెలల్లో పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు రానున్నాయి. కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజ ల్లోకి రేసు గుర్రాళ్లా దూసుకెళ్లాలి’... అంటూ డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో డీసీసీ తొలి కార్యవర్గ సమావేశం తాహెర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లాలోని మండల పార్టీ అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. జుక్కల్ నియోజకవర్గం మొదలుకుని కమ్మర్పల్లి వరకు పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, యూపీఏ- 3 ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించారు. తాహెర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే ఒక వ్యవస్థలాటిందన్నారు. కష్టకాలంలో ఆదుకునే నాయకత్వం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే తరుణంలో తనకు డీసీసీ అధ్యక్ష పదవి రావటం అదృష్టంగా భావిస్తున్నాని పేర్కొన్నారు. పార్టీని బల పర్చే బాధ్యత తనపై ఎంత ఉందో, పార్టీ శ్రేణుైలపైనా అంతే ఉంటుందన్న విషయన్ని మరువద్దన్నారు. ప్రజల్లోకి వెళ్లే కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీయే ఎంతో అభివృద్ధి చేసిందని గర్వంగా చెప్పుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీని నిల దీయండని కార్యకర్తలకు సూచించారు. మతతత్వ పార్టీలతో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికలో 50 శాతం రిజర్వేషన్ కల్పించింది సోనియాగాంధీయేనని, రాహుల్‌గాంధీ మరో అడుగు ముందుకేసి ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో... అందులో 50 శాతం ముఖ్యమంత్రి పదవులు మహిళలకే ఇస్తామని ఏఐసీసీ సమావేశంలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ సూచన మేరకు కేంద్రం సబ్సి డీ సిలిండర్లను తొమ్మిది నుంచి 12 వరకు పెంచిన విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఫిబ్రవరి 5లోపు మండల కమిటీలు వేయాలి.. ఫిబ్రవరి ఐదో తేదీలోపు మండల కాంగ్రెస్ కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని అధ్యక్షులను తాహెర్‌బిన్ హందాన్ ఆదేశించారు. గడువులోపు కమిటీలు వేయ ని అధ్యక్షుల గురించి ఆలోచించవలసి ఉంటుందని హెచ్చరించారు. మండల కమిటీలతో పాటు బూత్ కమిటీలను నియమించాలన్నారు. గడువులోపు మం డల కమిటీలను నియమించిన నియోజకవర్గాల్లోనే వచ్చే జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తామని తాహెర్ ప్రకటించారు. అయిదుగురితో జిల్లా సమన్వయ కమిటీ... జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు అయిదుగురు సభ్యులతో కూడిన జిల్లా పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తాహెర్ సమావేశంలో స్పష్టం చేయగా సభ్యులు మద్దతు ప్రకటించారు. అంసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు డీసీసీ తరపున ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి సురేందర్, సహా య కార్యదర్శి రాజేంద్రప్రసాద్, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, డీసీసీ కోశాధికారి మీసాల సుధాకర్, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు గన్‌రాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుబేర్ హైమ ద్, సేవదళ్ అధ్యక్షుడు శరత్‌కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.