నిజామాబాద్‌సిటీ,న్యూస్‌లైన్: ‘‘మూడు నెలల్లో పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు రానున్నాయి. కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజ ల్లోకి రేసు గుర్రాళ్లా దూసుకెళ్లాలి’... అంటూ డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో డీసీసీ తొలి కార్యవర్గ సమావేశం తాహెర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లాలోని మండల పార్టీ అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకున్నారు.
జుక్కల్ నియోజకవర్గం మొదలుకుని కమ్మర్‌పల్లి వరకు పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, యూపీఏ- 3 ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించారు. తాహెర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే ఒక వ్యవస్థలాటిందన్నారు. కష్టకాలంలో ఆదుకునే నాయకత్వం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే తరుణంలో తనకు డీసీసీ అధ్యక్ష పదవి రావటం అదృష్టంగా భావిస్తున్నాని పేర్కొన్నారు. పార్టీని బల పర్చే బాధ్యత తనపై ఎంత ఉందో, పార్టీ శ్రేణుైలపైనా అంతే ఉంటుందన్న విషయన్ని మరువద్దన్నారు. ప్రజల్లోకి వెళ్లే కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీయే ఎంతో అభివృద్ధి చేసిందని గర్వంగా చెప్పుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీని నిల దీయండని కార్యకర్తలకు సూచించారు. మతతత్వ పార్టీలతో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికలో 50 శాతం రిజర్వేషన్ కల్పించింది సోనియాగాంధీయేనని, రాహుల్‌గాంధీ మరో అడుగు ముందుకేసి ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో... అందులో 50 శాతం ముఖ్యమంత్రి పదవులు మహిళలకే ఇస్తామని ఏఐసీసీ సమావేశంలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ సూచన మేరకు కేంద్రం సబ్సి డీ సిలిండర్లను తొమ్మిది నుంచి 12 వరకు పెంచిన విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
ఫిబ్రవరి 5లోపు మండల కమిటీలు వేయాలి..
ఫిబ్రవరి ఐదో తేదీలోపు మండల కాంగ్రెస్ కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని అధ్యక్షులను తాహెర్‌బిన్ హందాన్ ఆదేశించారు. గడువులోపు కమిటీలు వేయ ని అధ్యక్షుల గురించి ఆలోచించవలసి ఉంటుందని హెచ్చరించారు. మండల కమిటీలతో పాటు బూత్ కమిటీలను నియమించాలన్నారు. గడువులోపు మం డల కమిటీలను నియమించిన నియోజకవర్గాల్లోనే వచ్చే జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తామని తాహెర్ ప్రకటించారు.
అయిదుగురితో జిల్లా సమన్వయ కమిటీ...
జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు అయిదుగురు సభ్యులతో కూడిన జిల్లా పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తాహెర్ సమావేశంలో స్పష్టం చేయగా సభ్యులు మద్దతు ప్రకటించారు. అంసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు డీసీసీ తరపున ధన్యవాదాలు తెలిపారు.
సమావేశంలో పీసీసీ కార్యదర్శి సురేందర్, సహా య కార్యదర్శి రాజేంద్రప్రసాద్, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, డీసీసీ కోశాధికారి మీసాల సుధాకర్, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు గన్‌రాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుబేర్ హైమ ద్, సేవదళ్ అధ్యక్షుడు శరత్‌కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
సిద్ధం కండి
Published Fri, Jan 24 2014 6:22 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement