
సాక్షి, వికారాబాద్ : ఓ ప్యారాషూట్ అకస్మాత్తుగా కుప్పకూలడం వికారాబాద్‌లో కలకలం రేపింది. దోమ మండలం ఊటుపల్లి అడవిలో అకస్మాత్తుగా ప్యారాషూట్ పడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అది వాతావారణ పరిశోధన శాఖకు చెందిన ప్యారాషూట్‌గా అధికారులు గుర్తించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
పరిశోధనలో భాగంగానే అటవీ ప్రాంతంలో ప్యారాషూట్‌ని దించామని టీఐఎఫ్‌ఆర్ సిబ్బంది పేర్కొంది. ప్యారాషూట్ చెందిన విడిభాగాలు వేర్వేరు గ్రామాల్లో పడిపోయినట్టు గుర్తించారు. అయితే ప్యారాషూట్‌తో పాటు కొన్ని బ్యాటరీల్లాంటి సామాగ్రి తమ గ్రామాల్లో పడిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.