‘భూకంపం వస్తోంది.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ప్రాణాలు రక్షించుకోండి’ అని బంధువుల నుంచి ఫోన్‌లు రావడంతో జనం ఆందోళన చెందారు.
సంగారెడ్డి/ నిజామాబాద్: ‘భూకంపం వస్తోంది.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ప్రాణాలు రక్షించుకోండి’ అని బంధువుల నుంచి ఫోన్‌లు రావడంతో జనం ఆందోళన చెందారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక మొదలైన కలకలం ఉదయం ఆరు గంటల దాకా సాగింది. జనం భయంతో రోడ్లపైకి వచ్చారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ పుకార్లు వ్యాపించాయి. నిజా మాబాద్ వాసులకు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి భూకంపం వదంతులపై ఫోన్లు వచ్చాయి. పలు టీవీ చానళ్లలో భూకంపంపై వదంతులు వ్యాపించినట్లు స్క్రోలింగ్‌లు కూడా వచ్చాయి. చివరికి వదంతులేనని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.