- నకిలీ స్టాంపులతో ధ్రువపత్రాల తయారీ
- ఆటో డ్రైవర్ మృతితో వెలుగులోకి వచ్చిన వైనం
తూప్రాన్: తూప్రాన్ మండలం పోతరాజుపల్లి అడ్డాగా నకిలీ వాహనాల ఇన్సూరెన్స్ పత్రాలను సృషిస్తూ రూ.లక్షల్లో స్వాహా చేస్తున్న ముఠాను పోలీసులు బుధవారం అదుపు లోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు విశ్వస నీయ సమాచారం. తూప్రాన్ మండలం పోతరాజుపల్లి అడ్డాగా గత ఏడాదికి పైగా వాహనాల నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు సృష్టిస్తూ పాలాట గ్రామానికి చెందిన ఓ యువకుడు మరి కొందరు కలసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు పోతరాజుపల్లిలో ఓ కార్యా లయాన్ని ఏర్పాటు చేసుకుని తమ నకిలీ దందాకు తెరలేపారు. తూప్రాన్, మనో హరాబాద్, వెల్దుర్తి, చేగుంట తదితర మం డలాల్లో సుమారు వెయ్యికి పైగా ఆటోలు ఉంటాయి. వారు ప్రతి ఏటా ఆటో ఇన్సూరెన్స్ పేరుతో ప్రభుత్వానికి ఏడాదికి రూ.3 వేల నుంచి 5 వేల వరకు చెల్లిస్తారు.
ఈ ముఠా సభ్యులు ఐసీసీఐ పేరుతో కలర్ జిరాక్స్ పత్రాలు, నకిలీ స్టాంపులతో అచ్చం ఒరిజినల్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల్ని తయారు చేస్తు న్నారు. వాటిని ప్రతి ఆటోకు రూ.1000 నుంచి రూ.1,500 వరకు తీసుకుని అంట గడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం తూప్రాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రాహ్మణపల్లికి చెందిన ఆటో డ్రైవర్ నర్సింహులు మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆటో ఇన్సూరెన్స్ పత్రాలను పోలీసులకు ఇవ్వడంతో అసలు కథ బయటపడింది. అవి నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలుగా తేలడంతో బాధిత కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఈ విషయం సీరి యస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి పోతరాజుపల్లి ఆఫీసులోని కలర్ ప్రింటర్, కంప్యూటర్, నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు స్వాధీ నం చేసుకుని, ఆ ముఠా సభ్యులను విచారిస్తున్నట్లు తెలిసింది.
ఇన్సూరెన్స్ పేరుతో లక్షల్లో స్వాహా
Published Thu, Dec 29 2016 3:21 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement