
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సాయంతో నడుస్తున్న పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధి ఆర్.వెంకటరెడ్డి మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది.