నామినేషన్ వేస్తున్నారా.. సరిచూసుకోండి.. | please check the nomination | Sakshi
Sakshi News home page

నామినేషన్ వేస్తున్నారా.. సరిచూసుకోండి..

Published Mon, Mar 17 2014 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM

please check the nomination

 చందుర్తి/ మేడిపెల్లి, న్యూస్‌లైన్ :
 ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నామినేషన్ ఘట్టం సోమవారం నుంచి ప్రారంభం కానుం ది. ఉదయం 10.30నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినే షన్లు స్వీకరిస్తారు. పోటీలో నిలిచేందుకు నాయకులు ఉత్సాహపడుతుంటారు.
 
 అరుుతే చాలామంది నామినేషన్లు వేసే సమయంలో నిబంధనలు పాటించకపోవడంతో తిరస్కరణకు గురవుతారుు. అరుుతే ఆ నిబంధనలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం...
 ఆస్తి, డిపాజిట్ల వివరాలు పొందపర్చాలి..
 ఎన్నికల్లో పోటీచేసేవారు తమ చర, స్థిరాస్థి, సర్వేనంబర్లు, ఉన్న భూమి, భవనాలు, వాణిజ్యమా, నివాసమా, అవి కుటుంబసభ్యులు పేరుపై ఉన్నాయూ?.. ఉంటే వారి వివరాలు డిక్లరేషన్ ఇవ్వాలి. బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, నగదు, బ్యాలెన్స్, భూములు వాటి మార్కెట్ విలువ, బంగారు ఆభరణాలు వాటి వివరాలు పేర్కొనాలి.
 
 పార్టీ, గుర్తు పేర్కొనాలి..
 బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేయాలనుకునే అభ్యర్థులు పార్టీ, గుర్తును తప్పనిసరిగా పేర్కొనాలి. ఏదైనా పార్టీ నుంచి టికెట్ వస్తుందని నమ్మకం ఉంటే ఫలానా పార్టీ అని రాయాలి. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తామనుకుంటే మూడింటిలో ఏ గుర్తు కావాలో ఒకదాన్ని కోరుతూ నామినేషన్‌లో ఎంపిక చేసుకోవాలి.
 
 ఉద్యోగులు రాజీనామా చేయాల్సిందే...
 ఎన్నికల్లో పోటీ చేయాలని ఆరాటపడే ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం నిబంధనల సంకేళ్లు వేసింది. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా నామినేషన్ వేస్తే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వాటిని తిరస్కరిస్తారు.ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటే మాత్రం తమ కొలువుకు రాజీనామా చేయూల్సిందే.
 
 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1,250
 అభ్యర్థులు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపీటీసీకి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1250, ఇతర కులాలవారు రూ.2,500 డిపాజిట్‌గా ఎ న్నికల సంఘం నిర్ణయించింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ లు కులధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోతే రూ.2500 చెల్లించాల్సి వస్తుంది. జెడ్పీటీసీగా పోటీచేసే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ.2500, ఇతరులకు రూ.5వేలు డిపాజిట్ ఉంటుంది. రిజర్వేషన్ స్థానాల్లో తప్పకుండా కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. లేకుంటే నామినేషన్ తిరస్కరణ చేస్తారు.
 ఎన్నికల్లో పోైలై న ఓట్లలో 8నుంచి 10శాతం వరకు ఓట్లు పొందితేనే డిపాజిట్ తిరిగి ఇస్తారు. ఎంపీటీసీ స్థానాలకు మండల పరిషత్ కార్యాలయంలో, జెడ్పీటీసీ స్థానాలకు కరీంన గర్‌లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.
 
 రేషన్ డీలర్లకు అవకాశం
 ప్రభుత్వ చౌకదుకాణందారుల(రేషన్ డీలర్)కు ఎన్నికల సంఘం తీపికబురు అందించింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులుగా ప్రకటించింది. రేషన్‌డీలర్లు ఎన్నికల్లో పోటీ  చేయవచ్చా? లేదా ? అనే సంశయానికి ఎన్నికల సంఘం తెరదించింది. ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఎన్నికల నియమావళిలో స్పష్టంగా పేర్కొంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement