ప్లీజ్.. ప్రాణభిక్ష పెట్టండి
జీవచ్ఛవంలా పడి ఉన్న ఈ యువకుడి పేరు కొండా పాపారావు. సత్తుపల్లి మండల పరిధిలోని రేజర్లకు చెందిన వాడు. సత్తుపల్లి గీతమ్స్ పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పెళ్లి అయ్యింది. భార్య పేరు కల్యాణి. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఉన్నట్టుండి వీరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జీబీ సిండ్రోమ్, పక్షవాతం బారినపడ్డాడు పాపారావు. కొద్దిరోజులుగా కోమాలోనే ఉన్నాడు. ప్రస్తుతం విజయవాడ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇప్పటికే కుటుంబ సభ్యులు ఉన్నది కాస్త అమ్మేసి వైద్యానికి రూ.3లక్షలు ఖర్చు చేశారు. అయినా ఎలాంటి మార్పూలేదు. ఇంకా రూ.6లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. చేతిలో చిల్లిగవ్వలేదు. మాయదారి జబ్బుతో పాపారావు పరిస్థితి క్షణం ఒక యుగంలా మారింది. ఏం చేయాలో ఆ కుటుంబ సభ్యులకు పాలుపోవడం లేదు. దాతలే పాపారావు ప్రాణాలు నిలబెట్టాలని వేడుకుంటున్నారు.
‘నా భర్తకు దాతలే ప్రాణభిక్ష పెట్టాలి’ అంటూ కల్యాణి కన్నీరుమున్నీరవుతోంది. ఆర్థికసాయం అందించాలనుకుంటున్న దాతలు ‘కొండా కల్యాణి (అకౌంట్ నంబర్: 33664673557, ఎస్‌బీఐ సత్తుపల్లి) పేరు మీద జమ చేయాలని వేడుకుంటోంది. మరిన్ని వివరాలకు 8019702328, 9705952584 నంబర్లను సంప్రదించాలని కోరుతోంది.
-సత్తుపల్లి