
మంత్రి పోచారం శ్రమదానం
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం శ్రమదానంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం దుర్కి గ్రామంలోని పీర్ల చెరువులో మిషన్ కాకతీయ పథకం కింద పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం పూడిక మట్టి లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను మంత్రి పోచారం స్వయంగా నడిపారు.
చెరువు మట్టిని రైతులు తమ పొలాలలకు తరలించుకుని భూసారం పెంచుకోవాలని సూచించారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకోవాలని రైతులకు మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పారు.