
పథకాలు రైతులకు అందించాలి
ఉద్యానాధికారులకు పోచారం పిలుపు
సాక్షి, హైదరాబాద్: రైతులకు ప్రభుత్వ పథకాలను అందించడంలో ఉద్యానశాఖ విస్తరణాధికారులు కీలకపాత్ర వహించాలని, విధి నిర్వ హణలో నిర్లక్ష్యధోరణి విడనాడాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పిలు పునిచ్చారు. జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో జిల్లా ఉద్యానశాఖ అధికారులు, కింది స్థాయి అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. పోచారం మాట్లా డుతూ ఉద్యాన పంటల ద్వారా రైతులకు అధిక లాభం వస్తుందన్నారు. ప్రతీ ఉద్యానాధికారి తమ పరిధిలోని పథకాల అమలు, రైతుల వివరాలతో నివేదికలు, రైతులకు సాంకేతిక సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం 6.73 లక్షల హెక్టార్లు ఉందన్నారు. శాఖ కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం పథకంపై ప్రతిఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. సూక్ష్మ సేద్యానికి నాబార్డు నుంచి ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకుందన్నారు. ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఉద్యానాధికారిని నియమించామన్నారు. ఆగ్రోస్ చైర్మన్ కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఒకేసారి వెయ్యి ఏఈవో పోస్టుల భర్తీ...
దేశ చరిత్రలోనే మొదటిసారి రాష్ట్ర వ్యవసాయశాఖలో వెయ్యి ఏఈవో పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి పోచారం తెలిపారు. శుక్రవారం రాత్రి వ్యవసాయ శాఖ విస్తరణాధి కారుల (ఏఈవో)S శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. సేద్యంలో ఖర్చులు తగ్గించి లాభాలను పెంచాలంటే రైతాంగాన్ని యాంత్రీ కరణ వైపు ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్‌మోహన్, వ్యవసాయాధి కారులు శ్యాంసుందర్‌రెడ్డి, రిటైర్డ్ వ్యవసాయాధికారి కృపాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.