
హైదరాబాద్: బషీర్‌బాగ్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీ కేసును నారాయణగూడ పోలీసులు ఛేదించారు. బంగారం కొనుగోలుకు వచ్చి, స్కై లైన్ అపార్టుమెంట్ నుంచి బయటకు వస్తున్నవారిని ముగ్గురు దుండగులు కలిసి దోపిడీ చేశారు. అపార్టుమెంట్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డు సహాయంతో నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. వాటర్ క్యాన్ వేయడానికి వెళ్లి డబ్బు చూసి దోపిడీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అపార్టుమెంట్‌లో వంట మనిషిగా పనిచేసే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక నాయకుడు శ్రీహరి మరో ఇద్దరితో (ఒకరు స్కైలైన్ ఎదురుగా ఉన్న బేకరీ యజమాని, టీడీపీ నాయకుడు రాజు కుమారుడితో) కలిసి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.