
ప్రజలకు ఎంపీ పొంగులేటి శుభాకాంక్షలు
ఖమ్మం: దశాబ్దాల ప్రజల కల నెరవేరింది...నవ తెలంగాణలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు నిరుపేదలందరికీ అందాలని, అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు.
పార్టీలకతీతంగా నవ తెలంగాణ నిర్మాణంలో అన్ని పార్టీలు భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్ర వాసుల ఆశయాలకు అనుగుణంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి, పరిష్కారానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. నవతెలంగాణ పునర్నిర్మాణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన పోరాడుతానని వివరించారు.