మహబూబ్‌నగర్: కర్ణాటక ప్రభుత్వం కృష్ణానదిపై అక్రమంగా నిర్మిస్తున్న బ్యారేజీలపై కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేయనున్నట్లు వెఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని పక్షాలను కలుపుకుని ఐక్యంగా పోరాడతామన్నారు. బుధవారం సాయంత్రం ఆయన రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న గిరిజాపూర్ బ్యారేజిని సందర్శించారు.
బ్యారేజి నిర్మాణంతో తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను దిగువకు వెళ్లకుండా అడ్డుకునే హక్కు కర్ణాటక రాష్ట్రానికి ఎవరిచ్చారని పొంగులేటి ఈ సందర్భంగా ప్రశ్నించారు. హైడల్ పవర్ పేరుతో కర్ణాటక జల చౌర్యానికి పాల్పడటం అభ్యంతరకరమని అన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఎడ్మ క్రిష్టారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి ఉన్నారు.
'కర్ణాటక అక్రమ నిర్మాణాలపై ఐక్యపోరాటం'
Published Wed, Aug 19 2015 4:55 PM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM
Advertisement