yedma krishna reddy
-
ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. శనివారం ఆయన కిష్టారెడ్డి కుమారుడు ఎడ్మ సత్యంకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. మనో ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. హైదరాబాద్ వచ్చాక కలుస్తానని చెప్పారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కిష్టారెడ్డి 1994, 2004 లో కల్వకుర్తి ఎమ్మెల్యే గా పనిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి ఎడ్మ కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. -
'కర్ణాటక అక్రమ నిర్మాణాలపై ఐక్యపోరాటం'
మహబూబ్‌నగర్: కర్ణాటక ప్రభుత్వం కృష్ణానదిపై అక్రమంగా నిర్మిస్తున్న బ్యారేజీలపై కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేయనున్నట్లు వెఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని పక్షాలను కలుపుకుని ఐక్యంగా పోరాడతామన్నారు. బుధవారం సాయంత్రం ఆయన రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న గిరిజాపూర్ బ్యారేజిని సందర్శించారు. బ్యారేజి నిర్మాణంతో తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను దిగువకు వెళ్లకుండా అడ్డుకునే హక్కు కర్ణాటక రాష్ట్రానికి ఎవరిచ్చారని పొంగులేటి ఈ సందర్భంగా ప్రశ్నించారు. హైడల్ పవర్ పేరుతో కర్ణాటక జల చౌర్యానికి పాల్పడటం అభ్యంతరకరమని అన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఎడ్మ క్రిష్టారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి ఉన్నారు.