హైదరాబాద్: ఉద్యోగుల భర్తీ విషయంలో నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో ఈ అంశంపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటైనా ఇప్పటికీ ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ విడుదలకాక పోవడం సరికాదన్నారు.
వేలకు వేలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. ప్రస్తుత సిలబస్‌తోనే ఉద్యోగుల భర్తీ చేయాలన్నారు.