
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తప్పని సరిగా ఓటు వేయాల్సిందేనని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల రోజు విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగి, పోస్టల్ బ్యాలెట్æద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకోసం ఫారం –12 ద్వారా రిటర్నింగ్ అధికారికి అభ్యర్థన పత్రం రాయాలి. జిల్లా ఎన్నికల అధికారి లేదా రిటర్నింగ్ అధికారి నిర్ధారణ పత్రంతో పాటు ఫారం–12 అందజేస్తారు. ఇది పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వేయడానికి సరిపోతుంది.
ఫారం–12 నింపి దానితో పాటు పోలింగ్ విధులకు నియమిస్తున్నట్లు ఇచ్చిన డబ్లుకేట్ ఆర్డర్ కాపీని జత పరచి రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. ఇది పోలింగ్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన కేంద్రంలో కూడా అందజేయవచ్చు. పోలింగ్ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను ఇచ్చిన తరువాత వారు ఓటు వేసి దానిని శిక్షణ తరుగతుల్లోనే జమచేసి వీలు రిటర్నింగ్ అధికారికి కల్పిస్తారు. దీని వల్ల పోస్టులో పంపాల్సిన అవసరం ఉండదు. మహిళ ఉద్యోగులు తాము పని చేస్తున్న నియోజక వర్గంలోనే పోస్టు అవుతారు. ఇలాంటి సందర్భంలో వారికి ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్ ఇస్తారు. అప్పుడు వారు ఎన్నికల విధులు నిర్వహించ వలసి ఉంటుందో అక్కడ ఓటు వేయవచ్చు.చివరి క్షణాల్లో ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్(ఈడీసీ)ఫోస్టింగ్ రద్దు ఆయితే వారు ఎక్కడ డ్యూటీ చేస్తారో అక్కడ ఓటు వేయవచ్చు. అయితే వారికి ఓటు ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment