వైఎస్ జగన్‌తో ప్రభుగౌడ్ భేటీ
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పి.ప్రభుగౌడ్ శనివారం హైదరాబాద్‌లో కలిశారు. జిల్లాలోని పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థుల ప్రచార ఏర్పాట్లపై అధినేతకు వివరించినట్టు ప్రభుగౌడ్ తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు సూచనలు చేసినట్టు ఆయన వెల్లడించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందారని ప్రభుగౌడ్ పేర్కొన్నారు. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి వివరించి ఓట్లు అడుగుతామన్నారు. జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్ సీపీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.