రేపు నగరానికి రాష్ట్రపతి | President Kovind to visit Hyderabad on Dec 19  | Sakshi
Sakshi News home page

రేపు నగరానికి రాష్ట్రపతి

Published Mon, Dec 18 2017 4:18 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు.

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఈ  సందర్భంగా 19న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు రామ్‌నాథ్ చేరుకుంటారు. అక్కడ నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

కార్యక్రమం అనంతరం తిరిగి రాజభవన్‌ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 20 వ తేదీ ఉదయం 10.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహానికి నివాళులర్పించి ఆ తర్వాత ఢిల్లీకి తిరిగి బయల్దేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు ఏసీపీలు, తొమ్మిది మంది సీఐలు, 25 మంది ఎస్సైలు, 35 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుళ్లు, హోం గార్డులు, ఆరు ప్లాటూన్ల సిబ్బంది ఈ బందోబస్తులో పాలుపంచుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement