ప్రధాని బీమా పథకాలకు అమితాబ్ ప్రచారం | Prime Minister insurance schemes to Amitabh campaign | Sakshi
Sakshi News home page

ప్రధాని బీమా పథకాలకు అమితాబ్ ప్రచారం

Published Tue, Jun 2 2015 3:37 AM | Last Updated on Mon, May 28 2018 3:50 PM

ప్రధాని బీమా పథకాలకు అమితాబ్ ప్రచారం - Sakshi

ప్రధాని బీమా పథకాలకు అమితాబ్ ప్రచారం

సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీమా పథకాలకు బాలీవుడ్ షెహన్‌షా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రచారం చేస్తున్నారు. ఇందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం విశేషం. సామాజిక బాధ్యతగా భావించి ఈ పథకాల ప్రచార వీడియోల్లో ఉచితంగా నటించేందుకు ఆయన అంగీకరించారు. ఇందులో భాగంగా తీవ్ర ఎండల్లో సైతం దాదాపు పది గంటల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు. అంతేకాదు, వాటికి డబ్బింగ్ కూడా స్వయంగా ఆయనే చెప్పారు.

ఇందుకు 2 రోజులు కేటాయించారు. దీంతో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన కార్యక్రమాలు మరింతగా ప్రజల్లోకి వెళతాయనడంలో సందేహం లేదని ఈ వీడియోలను రూపొందించిన అడ్వర్టయిజింగ్ సంస్థ ప్రచార్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డెరైక్టర్ వినీత జైన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement