
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఉన్నత స్థాయి పోస్టుల్లో బీసీలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు ఎలాంటి పోస్టులూ దక్కడం లేదని పేర్కొంటూ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జనాభా ప్రాతిపదికన సగం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బీసీలను గవర్నర్లుగా నియమించాలని కోరారు. 244 ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ వాణిజ్య బ్యాంకుల చైర్మన్లుగా బీసీలకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్టు మాదిరిగా బీసీ యాక్టును అమల్లోకి తీసుకురావాలని కృష్ణయ్య కోరారు.
Comments
Please login to add a commentAdd a comment