హైదరాబాద్‌సిటీ: పోలీసుల వేధింపులను తట్టుకోలేని ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఈ సంఘటన జరిగింది. జైలు డిప్యూటీ సూపరిండెంట్ దశరథం వేధింపులు భరించలేక సతీష్ (35) అనే జీవిత ఖైదీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.