బడి వేళాయె
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
వేసవి సెలవులు ముగిశారుు. నేటి నుంచి పాఠశాలలు..పుస్తకాలు..హడావిడి. ఏ ఇంట చూసినా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పిల్లలను బడికి సిద్ధం చేసే దృశ్యాలే. పుస్తకాల సంచులతో బడిబాట పట్టేందుకు విద్యార్థులు కూడా రెడీ అయ్యూరు. ప్రైవేట్ స్కూళ్లు అడ్మీషన్ల కోసం అందంగా ముస్తాబై కనబడుతుండగా...ప్రభుత్వ పాఠశాలలు మాత్రం సమస్యలతోనే స్వాగతం పలుకుతున్నారు. అరకొర వసతుల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. అరునా సరే, గణ..గణ..గంట మోగుతోంది..బడి వే ళైంది.. చలో..చలో... - ఖమ్మం
- సర్కారీ బడుల్లో సమస్యల స్వాగతం
- పర్యవేక్షణకు అధికారులు కరువు
- కలవర పెడుతున్న పది ఫలితాలు
- రూ.కోట్లు వె చ్చించినా మౌలిక వసతులు డొల్ల
ఇది చండ్రుగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ స్కూల్ తరగతి గదులకు శ్లాబ్ వేయకుండానే వదిలేశారు. రెండేళ్ల నుంచి అలానే ఉంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రహరీ ఒక వైపు కూలిపోరుంది. వంటషెడ్, మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నారు.
ఇది కూసుమంచి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం. శ్లాబు పెచ్చులూడి శిథిలావస్థకు చేరింది. సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో 700 మంది విద్యార్థులుండగా ఈ భవనం (నాలుగు గదులు)లో 400 మంది బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సిందే. తాగునీరు లేదు. ప్రహరీ, వంట గది లేదు.
ఖమ్మం: చూస్తూ ఉండగానే వేసవి సెలవులు గడిచిపోయూరు. నేటి (శుక్రవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నారు. బడిగంట మోగనుండటంతో విద్యార్థులు పుస్తకాలు, బ్యాగుల దుమ్ము దులుపుతున్నారు. ఎప్పటి మాదిరే సర్కారీ బళ్లు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, కోట్లు వెచ్చించినా ముందుకు సాగని నిర్మాణాలు, మూలనపడిన కంప్యూటర్లు, అధికారుల లేమి..అవస్థల మధ్య ఎప్పటిలాగే బడిగంట మోగుతోంది. గత విద్యాసంవత్సరం పడిపోరున పది ఫలితాలు విద్యాశాఖను కలవరపెడుతున్నారుు.
నిధులొచ్చి ఏం లాభం?
రాజీవ్‌విద్యామిషన్, ఆర్‌ఎంఎస్‌ఏతో పాటు పలు గ్రాంట్లు కోట్లాదిగా వస్తున్నా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. గత విద్యాసంవత్సరంలో ఐదు నూతన పాఠశాలలు మంజూరయ్యూరుు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసింది. ఇందులో మూడు పాఠశాలల నిర్మాణాలు చేపట్టినా అవి నత్తన డకనే కొనసాగుతున్నారు.
మిగిలిన రెండు పాఠశాలల పనులు మొదలేపెట్టలేదు. 254 అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ. 17.35 కోట్లు మంజూరయ్యూరు. ఇందులో 137 మాత్రమే గ్రౌండ్ చేయగా పనులు వివిధ దశల్లో ఉన్నారు. 117 గదుల నిర్మాణాలు ఇప్పటికీ ప్రారంభించలేదు. జిల్లాలో 39 పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నారు. ఇవి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొందని ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చారు.
టారులెట్లు లేవాయె..నీళ్లు కరువాయె...
జిల్లాలోని పలు పాఠశాలల్లో తాగునీరు కూడా సక్రమంగా లేదు. నీళ్లున్న చోట మరుగుదొడ్లు లేవు. 245 పాఠశాలల్లో తాగునీటి కోసం రూ. 2.94 కోట్లు కేటాయించారు. కానీ నేటికీ ఒక్కపాఠశాలలో కూడా తాగునీరు అందించలేదు. వంటగదుల నిర్మాణం కోసం నిధులు కేటారుంచినా వాటిని నేటికీ పూర్తి చేయలేదు. పాఠశాలల్లో బాల, బాలికల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు ఉండాలని సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రూ. 9.97 కోట్లతో 778 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, రూ. 1.10 కోట్లతో 466 పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లకు మరమ్మతులు చేయాలని రాష్ట్ర అధికారులు నిధులు విడుదల చేశారు. ఈ పనులు పాఠశాలల పునఃప్రారంభం నాటికే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినా నేటి వరకు మార్కింగ్ ఇవ్వనివి కూడా ఉండటం గమనార్హం. ప్రతి సంవత్సరం పాఠశాలల పునఃప్రారంభం నాటికే దుస్తులు అందించేవారు. ఈ ఏడాది క్లాత్ కొనుగోలు ప్రక్రియ కూడా పూర్తికాలేదు.
‘పది’లో పల్టీపై ఆందోళన
గత విద్యాసంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లా వెనకబడటంపై ఆందోళన నెలకొంది. జిల్లా విద్యాశాఖ పనితీరుపై రాష్ట్ర అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో అత్యధికంగా 6,699 మంది విద్యార్థులు గణితం, 2,708 మంది విద్యార్థులు సామాన్యశాస్త్రంలో ఫెయిల్ కావడం శోచనీయం. ఈ ఫలితాలపై సమీక్షలు జరిపి మరోమారు ఈ పొరపాటు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు పేర్కొంటున్నారు. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ భారీ కసరత్తు చేయూల్సిందిగా ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
అధికారుల కొరత
జిల్లాలోని 41 మండలాల్లో ఖమ్మం అర్బన్, కారేపల్లి, కామేపల్లి, సత్తుపల్లి మండలాలకు మాత్రమే మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ఖమ్మం, మధిర, కొత్తగూడెం, జిల్లా పరిషత్ డిప్యూటీ డీఈవో పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇవి ఇన్‌చార్జ్‌ల ఆధీనంలోనే ఉండటంతో పాఠశాలల పర్యవేక్షణ కొరవడింది. పలు పాఠశాలలకు ఉపాధ్యాయులు సక్రమంగా హాజరు కావడం లేదనే ప్రచారం జరుగుతోంది. రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది.
దీనిని అధిగమించి ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం కల్గించే విధంగా చూడటం విద్యాశాఖపై ఉన్న పెద్ద బాధ్యతగా పలువురు పేర్కొంటున్నారు. 256 పాఠశాలల్లో విద్యుత్ సరఫరా లేదు. ఇన్‌స్ట్రక్టర్లు లేక కంప్యూటర్లు మూలనపడ్డారు. సైన్స్‌పరికరాలు లేని పాఠశాలలు అనేకం ఉన్నారు. ఉన్నచోట కూడా ఉపయోగించిన దాఖలాలు అరుదుగా ఉన్నారు. గత సంవత్సరం రాజీవ్ మాధ్యమిక విద్యామిషన్ నుంచి విడుదలైన నిదులు ఏలా ఖర్చు చేయాలో మార్గదర్శకాలు లేక బ్యాంక్ అకౌంట్లలో మూలుగుతున్నాయి. ఈ ఏడాదైనా విద్యాశాఖ ‘పాఠాలు’ నేర్చుకోవాలని..సమస్యలను అధిగమించాలని పలువురు కోరుతున్నారు.