సూర్యాపేట : ప్రొ. జయశంకర్ సార్ ఆశయ సాధన కోసమే కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో తన స్వగృహంలో మంత్రి ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రొ. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం సార్ ఆశయ సాధన కోసమే కృషి చేస్తోందన్నారు. నల్లగొండ జిల్లా ప్లోరిన్ సమస్యను ప్రపంచానికి తెలిసేలా చేసిన మహోన్నత వ్యక్తి ప్రొ. జయశంకర్ సార్ అని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు.
నిజామాబాద్: ప్రొ. జయశంకర్ జయంతోత్సవాలను నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయం, టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు అధికారులు, పార్టీ కార్యకర్తలు ప్రొ. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సార్.. ఆశయ సాధన కోసం కృషి
Published Thu, Aug 6 2015 2:12 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement