సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ చింతకింద కాశీంను ఆదివారం ఉదయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ముందు హాజరుపరిచారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ శనివారం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి గజ్వేల్‌కు తరలించిన విషయం తెలిసిందే. దీనిపై పౌరహక్కల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టిన సీజే ఆదివారం ఉదయం తమ ఎదుట హాజరుపర్చాలని తెలంగాణ పోలీసులను ఆదేశించారు. సీజే ఆదేశాల మేరకు పోలీసులు కాశీంను సీజే ఇంటిముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కాశీంను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆయన్ని వెంటనే విడుదల చేయాలంటూ సీజే ఇంటిముందు విద్యార్థులతో పాటు, ప్రజాసంఘాలు ధర్నాకు దిగారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసు అధికారులు భారీగా బలగాలను మోహరించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. (ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment